Home » News » Karthika Deepam 2 Today 04 March 2026 Episode Highlights
News

Karthika Deepam 2 Today 04 March 2026 Episode : దీప కడుపులో బిడ్డపై పారిజాతం కుట్ర.. అడ్డంగా దొరికిపోయిన కార్తీక్, దీప!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 4, 2026 7:38 am
Advertisement

Karthika Deepam 2 Today 04 March 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది. సుమిత్ర ప్రాణాలు కాపాడటం కోసం దీప తన కడుపులోని బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధపడటం, ఈ విషయం పారిజాతానికి తెలియడం, ఆమె కాంచన మనసులో విషం నింపడంతో ఈరోజు మార్చి 4 ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

Karthika Deepam 2 Today 04 March 2026 Episode : దీప కడుపులో బిడ్డపై పారిజాతం కుట్ర.. అడ్డంగా దొరికిపోయిన కార్తీక్, దీప!

Karthika Deepam 2 Today 04 March 2026 Episode స్వప్నకు అండగా నిలిచిన శ్రీధర్ – రగిలిపోయిన కావేరి

విడాకుల మీద సంతకాలు చేసిన కూతురు స్వప్నకు శ్రీధర్ ప్రేమగా ఆపిల్ కట్ చేసి తినిపిస్తుంటాడు. ఇది చూసిన కావేరి కోపంతో రగిలిపోతుంది. “కూతురు విడాకుల పేపర్ల మీద సంతకం చేస్తే మందలించాల్సింది పోయి, ప్రేమగా ఆపిల్ తినిపిస్తున్నారా? కేక్ తెచ్చి సెలబ్రేట్ చేయాల్సింది” అంటూ భర్తపై ఫైర్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు స్వప్న.. “అమ్మకి నా మీద అంత కోపం ఉంది కదా, మరి మీకెందుకు నా మీద కోపం లేదు నాన్నా?” అని అడుగుతుంది.

Advertisement

దానికి శ్రీధర్ స్పందిస్తూ.. “మీ అమ్మ భయం అంతా నీ జీవితం ఏమైపోతుందో, నలుగురు ఏమనుకుంటారో అని మాత్రమే. కానీ నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రతి కూతురికి నాన్న ఒక హీరో. నా కూతురికి నేనే ధైర్యంగా ఉండాలి. వివాహ బంధాన్ని ఎవరూ కావాలని తెంచుకోరు. నచ్చలేదని వద్దనుకున్నావు. అందరిలాగే నేనూ నిన్ను తిడితే వాళ్లకు, నాకు తేడా ఏముంటుంది? నీకు నచ్చింది చెయ్, ఎప్పుడూ నవ్వుతూ ఉండు” అని ధైర్యం చెబుతాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న స్వప్న తండ్రిని హత్తుకుంటుంది.

Karthika Deepam 2 Today 04 March 2026 Episode పారిజాతం కుట్ర.. కాంచన మనసులో విషం

మరోవైపు సుమిత్రను బతికించడం కోసం దీప కడుపులో బిడ్డను వదులుకోవడానికి దశరథ, కార్తీక్, దీప తీసుకున్న నిర్ణయాన్ని పారిజాతం చాటుగా వింటుంది. దీప కడుపులో బిడ్డను తీసేస్తున్నారనే విషయం మాత్రమే పారిజాతానికి అర్థం అవుతుంది. వెంటనే ఈ నిజాన్ని కాంచనకు చెప్పి ఇల్లరికం చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంది.

Advertisement

వెంటనే కాంచనకు ఫోన్ చేసి.. “నువ్వు నీ కోడలు, పుట్టబోయే బిడ్డ గురించి గంపెడు ఆశలు పెట్టుకున్నావు. కానీ అవన్నీ అబద్ధం అని తెలిస్తే తట్టుకోగలవా? నీ కోడలు కడుపు వద్దనుకుంటోంది” అని బాంబు పేల్చుతుంది. ఆ మాటలకు కాంచన ఉలిక్కిపడుతుంది. “నీ కొడుకు, నీ అన్న, కోడలు ముగ్గురూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నీ కోడలికి ఈ కడుపు మోయడం ఇష్టం లేదు. కారణం ఏంటో నువ్వే తెలుసుకో. నీ కోడలు నీ కొడుకుని గుప్పిట్లో పెట్టుకుంది” అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. పారిజాతం మాటలతో కాంచన తీవ్ర ఆలోచనలో పడుతుంది.

కార్తీక్, దీపల ధర్మసంకటం

మరోవైపు దీప, కార్తీక్ ఆస్పత్రికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. “అత్తయ్యకు పుట్టబోయే బిడ్డ గురించి మాట ఇచ్చాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అత్తయ్య ముఖం ఎలా చూడగలను? అసలు ఏం చెప్పి ఆస్పత్రికి వెళ్దాం?” అని దీప ఎమోషనల్ అవుతుంది. దానికి కార్తీక్ సమాధానమిస్తూ.. “ఏదైతే అనుకున్నామో అదే మాట మీద ఉందాం. మనకు అమ్మ బతకాలి. మనం ధైర్యంగా ఉందాం. ఏదో ఒక అబద్ధం చెప్పి హాస్పిటల్‌కి వెళ్దాం. మీ నాన్న కోసం, మా అమ్మ కోసం మనం ఈ నిర్ణయం మార్చుకునేది లేదు” అని ఖరాఖండిగా చెబుతాడు.

దాసుకు నిజం చెప్పేసిన దశరథ.. బిడ్డ మృత్యుంజయురాలు!

ఉదయాన్నే దాసును కలిసిన దశరథ అసలు నిజం చెప్పేస్తాడు. “సుమిత్ర బతకాలంటే దీప ఆపరేషన్ చేయాలి. కానీ అలా చేస్తే దీప కడుపులో బిడ్డ బతకదు. దీప కడుపులో బిడ్డ బతికితే, సుమిత్ర బతకదు” అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ మాటలు విన్న దాసు చలించిపోతాడు. “దీప కథను ఏ రాతి గుండె రాసింది అన్నయ్య? నా కూతురి జీవితంలో ఇన్ని కష్టాలా? కానీ నా మాట నమ్ము.. నా దీప బిడ్డకు ఏం కాదు. ఆ బిడ్డ మృత్యుంజయురాలు అవుతుంది” అని దాసు ధీమా వ్యక్తం చేస్తాడు.

అడ్డంగా దొరికిపోయిన కార్తీక్, దీప

పారిజాతం ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని కాంచన తీవ్రంగా తీసుకుంటుంది. ఈ విషయాన్ని శ్రీధర్, అనసూయలకు వివరిస్తుంది. “నిజంగానే దీప తన కడుపు వద్దనుకుంటుందా?” అని కాంచన బాధపడుతుండగా.. అప్పుడే కార్తీక్, దీప లగేజీ బ్యాగ్‌తో కిందకు వస్తారు. “కొన్ని రోజులు సరదాగా బయటకు వెళ్దామని అనుకుంటున్నాం అమ్మ” అని కార్తీక్ అబద్ధం చెబుతాడు.

Advertisement

దీంతో కోపంతో రగిలిపోయిన కాంచన.. “ఇంకా నిజాలు ఎందుకు దాస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేయబోతున్నారో పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పేసింది!” అని కార్తీక్, దీపలను నిలదీస్తుంది. ఆ మాటలకు కార్తీక్, దీప షాక్ అవుతారు. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయి భాగంలో ఏం జరగబోతోంది? కాంచనకు కార్తీక్ అసలు నిజం (సుమిత్ర ఆరోగ్యం గురించి) చెబుతాడా? లేదా పారిజాతం ఆడిన నాటకం వల్ల దీపను కాంచన అపార్థం చేసుకుంటుందా? అనేది తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి