Categories: NewsTV Shows

Karthika Deepam 2 Today 27 Feb 2026 : దీప కన్నకూతురని సుమిత్రకు చెప్పిన దశరథ.. జ్యోత్స్నకు షాక్, ఇకపై ఇంట్లో పనిమనిషిగా జ్యో!

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 2 Today 27 Feb 2026 : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోజురోజుకూ ఊహించని మలుపులతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సీరియల్ రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా దీప తన కన్నకూతురు అని దశరథకు తెలియడంతో కథ సరికొత్త మలుపు తిరిగింది. ఈరోజు (ఫిబ్రవరి 27) ఎపిసోడ్ లో భలే రసవత్తరమైన, ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. దీపను అగౌరవపరచాలని చూసిన పారిజాతం, జ్యోత్స్నలకు దశరథ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 Today 27 Feb 2026 : దీప కన్నకూతురని సుమిత్రకు చెప్పిన దశరథ.. జ్యోత్స్నకు షాక్, ఇకపై ఇంట్లో పనిమనిషిగా జ్యో!

Karthika Deepam 2 Today 27 Feb 2026 సుమిత్రకు నిజం చెప్పే ప్రయత్నంలో దశరథ.. అడ్డుకున్న కార్తీక్

ఎపిసోడ్ ప్రారంభంలో.. దాసు మామయ్య కనిపించకుండా పోవడం వెనుక కిడ్నాప్ ఏమైనా జరిగిందేమో అని జ్యోత్స్న, పారిజాతం భయపడుతూ ఉంటారు. శివనారాయణ ముందు పారిజాతాన్ని ఇరికించాలని కార్తీక్ ప్రయత్నిస్తాడు. కానీ, సుమిత్ర ఆపరేషన్ టెన్షన్ తో అలా మాట్లాడుతున్నానని పారు కవర్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. సుమిత్ర నిద్రిస్తున్న గదిలోకి దీపను తీసుకువెళ్తాడు దశరథ.

Advertisement

“ఏ ఇంట్లో అయినా కన్నబిడ్డను తొలుత తండ్రికి పరిచయం చేసేది భార్యే. కానీ దేవుడు నా కథను కొత్తగా రాశాడు. నేనే నా భార్యకు కన్నకూతురు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఎమోషనల్ అవుతాడు. నిద్రపోతున్న సుమిత్ర దగ్గరకు వెళ్లి, ‘దీపే మన కన్న కూతురు’ అని చెబుతాడు. తన పుట్టుక గురించి ఎవరికీ చెప్పొద్దని దీప తన దగ్గర మాట తీసుకుందని, లేదంటే ఈపాటికే అందరికీ తెలిసేదని దశరథ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిన్నటి వరకు భార్య బతుకుతుందో లేదో అన్న భయం ఉండేదని, ఇప్పుడు కన్నకూతురు తోడుగా ఉండటంతో ఆ భయం పోయిందని అంటాడు. అయితే, కార్తీక్ మాత్రం దశరథను బయటకు తీసుకురావాలని చూస్తాడు. అత్తకు ముందు ఆపరేషన్ జరిగి, పూర్తిగా కోలుకున్నాకే ఈ నిజం చెప్పాలని కార్తీక్ నచ్చజెబుతాడు. ఆనందాన్ని తట్టుకోలేక ఒక తల్లి చనిపోయిన కథను ఉదాహరణగా చెప్పి దశరథను ఆపుతాడు.

Karthika Deepam 2 Today 27 Feb 2026 దీపను పడగొట్టాలని చూసిన జ్యోత్స్న.. పారు ఓవరాక్షన్

కార్తీక్, దీపలు గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత జ్యోత్స్న, పారిజాతం తమ కుట్రలకు తెరతీస్తారు. దీపను ఎలాగైనా ఏడిపించాలని ప్లాన్ చేస్తారు. పారిజాతం కావాలనే దీపను కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది. దీప కాఫీ తీసుకుని వస్తుండగా, జ్యోత్స్న కావాలనే తన కాలు అడ్డుపెడుతుంది. దీంతో దీప కాలు జారి, ఆమె చేతిలోని కాఫీ అంతా వెళ్లి పారిజాతం మీద పడుతుంది. దీనినే సాకుగా తీసుకున్న పారిజాతం కోపంతో ఊగిపోతుంది. కళ్లు నెత్తికెక్కి పోయాయా అంటూ దీపను కొట్టడానికి చేయి ఎత్తుతుంది. జ్యోత్స్న కూడా దీపను నానా మాటలు అంటుంది.

దశరథ ఉగ్రరూపం.. పారిజాతం, జ్యోత్స్నలకు వార్నింగ్

పారిజాతం దీపను కొట్టబోయే సమయానికి కరెక్ట్ గా ఎంట్రీ ఇస్తాడు దశరథ. ‘దీప మీద చేయి ఎందుకు ఎత్తుతున్నావ్ పిన్ని’ అని గట్టిగా అరుస్తాడు. ఆ ఆవేశం చూసి ఇంట్లోని వారంతా షాక్ అవుతారు. ఆ తర్వాత జ్యోత్స్న వైపు తిరిగి.. ‘దీపకు నువ్వు కాలు ఎందుకు అడ్డుపెట్టావ్?’ అని నిలదీస్తాడు. దానికి జ్యోత్స్న వణికిపోతూ.. మొబైల్ చూస్తూ పొరపాటున కాలు ముందుకు పెట్టానని అబద్ధం చెబుతుంది. తప్పంతా మీదే ఉంచుకుని దీపను అంటారేంటి అని దశరథ మండిపడతాడు.

“దీప కింద పడిపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? పనిమనిషిని కాఫీ అడగడం తప్పు కాదు కదా అని అంటున్నావ్. అసలు దీప పనిమనిషి కాదు.. నా మేనల్లుడి భార్య, నా చెల్లెలి కోడలు. నీకు పనిమనిషి కావొచ్చేమో కానీ, నాకు మాత్రం ఆప్తురాలు, నా భార్య ప్రాణదాత” అని దశరథ తేల్చి చెబుతాడు. కడుపుతో ఉన్న మనిషితో పని చేయించడం ఏంటి అని ఫైర్ అవుతాడు.

ఇకపై జ్యోత్స్నదే వంటగది బాధ్యత..

దశరథ అక్కడితో ఆగడు. జ్యోత్స్నకు గట్టి షాక్ ఇస్తాడు. “ఈ రోజు నుంచి దీప ఇంట్లో ఎలాంటి పనులు చేయదు. నీకు కానీ, పిన్నికి కానీ కాఫీలు, టిఫిన్లు ఇవ్వదు. మీకు ఏమైనా కావాలంటే జ్యోత్స్నను అడగాలి. ఇక మీదట వంట పనులన్నీ జ్యోత్స్న చేయాల్సిందే” అని ఆర్డర్ వేస్తాడు. ఈ మాటలకు జ్యోత్స్న తలపట్టుకుంటుంది. నా వల్ల కాదు డాడీ అని అన్నా కూడా దశరథ వినడు.

ఇంతలో పెద్దాయన శివనారాయణ కల్పించుకుని, జ్యోత్స్న మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు అని అడుగుతాడు. దానికి దశరథ చాలా తెలివిగా సమాధానం ఇస్తాడు. “పెళ్లి చేసుకుని వెళ్లిపోయే మనిషే కదా. ఇక్కడ పనులు నేర్చుకోకపోతే రేపు అత్తగారింట్లో భర్తకు కాఫీ కూడా పెట్టదా? పని చేయకపోతే మన పెంపకం గురించి తప్పుగా అనుకుంటారు. రెండు నెలల తర్వాతైనా వెళ్లిపోవాలి కదా.. వంట వార్పు నేర్చుకోవాల్సిందే” అని ఖరాకండిగా చెప్పేస్తాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతంలకు నోట మాట రాదు.

పెద్దాయన టెన్షన్.. కార్తీక్ సెటైర్లు

ఆ తర్వాత శివనారాయణ, దీప దగ్గరకు వచ్చి, కడుపులోని బిడ్డ కోసం పనులు తగ్గించుకోమని సలహా ఇస్తాడు. దీప కడుపులో పెరుగుతున్నది వాళ్ల అమ్మే అని దశరథ, కాంచన నమ్ముతున్నారని, అందుకే దీప పడిపోతుంటే దశరథ అంతలా రియాక్ట్ అయ్యాడని పెద్దాయన అంటాడు. మరోవైపు దాస్ గుడిలో కలిశాడని చెప్పినా, కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారో అర్థం కాక పెద్దాయన వెళ్లిపోతాడు. అప్పుడు కార్తీక్.. భలే తప్పించుకున్నావ్ అంటూ పారు మీద సెటైర్లు వేస్తాడు.

దశరథలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు చూసి పారు, జ్యోత్స్న గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. దాస్ మామయ్య డాడీకి ఏమైనా చెప్పేశాడా? మన గుట్టు రట్టయిపోయిందా? అని జ్యోత్స్న మనసులో భయపడుతూ ఉంటుంది. మరోవైపు, దశరథ బాధను కార్తీక్ అర్థం చేసుకుని అతన్ని సముదాయిస్తాడు. సుమిత్రకు నిజం చెప్పకుండా పాపం చేస్తున్నానేమో అని దశరథ బాధపడటంతో ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో వంటగదిలో జ్యోత్స్న పడే పాట్లు, దీపకు దశరథ ఇస్తున్న మర్యాద చూసి పారిజాతం రగిలిపోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా దాస్ ఎక్కడున్నాడు అనే దానిపై కార్తీక్ కూపీ లాగే అవకాశం ఉంది.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Banana vs Dates : అరటిపండా Vs ఖర్జూర.. ఉదయాన్నే ఏ పండు తింటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం?

Banana vs Dates : ఉదయం లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.…

13 minutes ago

Venu Swamy : ఆ స్టార్స్ కు ప్రాణ‌గండం.. మరోసారి సెలబ్రిటీల జాతకాలపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…

8 hours ago

Peddi Movie 1st Day Box Office : పెద్ది మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు..?

Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…

9 hours ago

Pawan Kalyan : తెలంగాణ మీ అయ్యా జాగీరా.. పవన్ కళ్యాణ్ ఫైర్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…

10 hours ago

Peddi Movie Review : రామ్ చరణ్ పెద్ది మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్..!

Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…

10 hours ago

Boduppal : తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : బోడుప్పల్‌ సింగిరెడ్డి పద్మారెడ్డి

Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…

12 hours ago

Telangana Formation Day : బాచుపల్లి లో కాంగ్రెస్ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…

13 hours ago

Kolan Hanmanth Reddy : తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిది : కొలన్ హన్మంత్ రెడ్డి

Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…

13 hours ago

Mandumula Parameshwar Reddy : సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ సాధ్యం.. కాంగ్రెస్‌కే పూర్తి ఘనత: మందుముల పరమేశ్వర్ రెడ్డి

Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…

14 hours ago

Vijayasai Reddy : లోకేష్ నిర్ణయం మంచిదే కానీ.. టీడీపిపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…

16 hours ago

Chandrababu Naidu : మత విద్వేషాలు రెచ్చగొడితే తాట తీస్తాం అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌..!

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…

17 hours ago

MLC Malka Komaraiah : ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అదనపు భారం వద్దు.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కీలక డిమాండ్లు..!

MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…

18 hours ago