Home » News » A Women Slapped The Police Viral Video
News

Viral Video : పోలీసును చెప్పుతో కొట్టిన ఓ మహిళ .. రెచ్చిపోయిన పోలీసు ఏం చేశాడంటే..?? ఊహించలేం..!!

Authored By
aruna
The Telugu News | Updated on: October 4, 2023 5:20 pm
Advertisement

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాలలో వైరల్ అవుతుంది. అది మంచైనా చెడైనా సరే సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాటికి స్పందిస్తూ ఉంటారు. మంచి వాటిని తమ పొగడ్తలతో ఎంత ప్రశంసిస్తారో, తప్పుడు పనులను కూడా అంతకంటే ఎక్కువ రేంజ్ లో విమర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ మహిళ పోలీసును చెప్పు తీసుకొని కొట్టింది. అయితే ఆమె అలా ఎందుకు కొట్టిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ పోలీసు మాత్రం ఆమెపై తీవ్రంగా కోప్పడ్డాడు. చివరికి ఊహించని విధంగా ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.

Advertisement

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ మార్కెట్లో వస్తువులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా ఓ పోలీసు ఆమె వస్తున్న ఆటోను అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. చూస్తూ ఉండగానే వారిద్దరి మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లారు. అప్పటికే అక్కడున్న పోలీసులు తోటి ఉద్యోగి కోపం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పోలీసు ఆమెతో ఎలా ప్రవర్తించాడో తెలియదు కానీ ఆమె మాత్రం అతడిని చెప్పు తీసుకొని కొట్టింది. దీంతో తీవ్ర కోపానికి గురైన పోలీసు ఆమెను కాలితో తన్నాడు.

A women slapped the police Viral Video

Advertisement

దీంతో పోలీసులు అతడిని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పోలీసు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే నేను కూడా అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి అతనిపై ఫిర్యాదు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. పోలీస్ అధికారి ఆ మహిళతో ప్రవర్తించిన తీరుకి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి