Home » News » Bridal Dance For Dodge Song Video
News

Viral Video : డీజే టిల్లు సాంగ్‌కు వధూవరుల డ్యాన్స్.. అరుపులే.. అరుపులు

Authored By
mallesh
The Telugu News | Updated on: June 7, 2022 11:32 pm
Advertisement

Viral Video : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమాలోని టైటిల్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో ఎంతోమంది కవర్ సాంగ్స్ చేసి పోస్ట్ చేశారు. తాజాగా ఓ పెళ్లి ఊరేగింపులో వధూవరులు డీజే టిల్లు టైటిల్ సాంగ్‌కు కారులోనే నిలబడి డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. దీంతో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వధువు డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

పట్టుచీర, నగలు పెట్టుకుని చేతులు ఊపుతూ ఆమె చేసిన మాస్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ఆమె డ్యాన్స్‌ను అందరూ అభినందిస్తూ బెస్ట్ విషెస్ చెప్తున్నారు. కాగా లాలాగూడ.. అంబర్‌ పేట.. మల్లేపల్లి.. మలక్‌ పేట.. టిల్లు అన్నా డీజే పెడితే అంటూ సాగే పాట సినిమాలో హీరో క్యారెక్టర్‌ను వివరిస్తూ సాగుతుంది. ఈ పాటకు మాస్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్‌కు కాసర్ల ర్యామ్‌కు సాహిత్యం అందించగా రామ్‌ మిర్యాల ఆలపించారు.

Bridal Dance for Dodge Song Video

Advertisement

శ్రీచరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చారు.విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్‌తోనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుని దుమ్ము రేపింది. ఓటీటీలోనే కాకుండా టీవీలోనూ డీజే టిల్లు సినిమా మంచి రేటింగ్ సంపాదించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి