Home » News » Bride And Bridegroom Dance Video Viral
News

Viral Video : ఊరేగింపులో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊర మాస్ డ్యాన్స్ అదుర్స్.. ఏం ఎనర్జీరా బాబు

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: May 30, 2022 11:25 am
Advertisement

Viral Video : సాధారణంగా పెళ్లి అంటేనే సందడి, సంతోషం, డ్యాన్సులు గట్రా. రెండు మూడు రోజుల పాటు పెళ్లి ఇంట్లో ఉండే సందడే వేరు. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సందడి షురూ అవుతుంది. ఆటలు, పాటలు, సంగీత్ లు, సరదాలు.. ఇలా పెళ్లి అంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది.పెళ్లి తర్వాత సాయంత్రం పూట జరిగే ఊరేగింపే పెళ్లిలో హైలైట్ గా నిలుస్తుంది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురును సాగనంపే సమయంలో ఊళ్లో వాళ్లను ఊరేగిస్తారు. ఆ సమయంలో డీజే పెట్టి చేసే డ్యాన్సుల గురించి చెప్పాల్సిన పని లేదు.

Advertisement

కొన్ని చోట్ల అయితే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ కూడా అదిరిపోతుంది.కొన్ని రోజుల కింద ఓ పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆ పాటకు పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ ఒక సెన్సేషన్ గా నిలిచింది. అప్పటి నుంచి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయకుండా పెళ్లి జరగడం లేదు.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

bride and bridegroom dance video viral

Advertisement

Viral Video : తాజాగా మరో జానపద పాటకు డ్యాన్స్ చేసిన కొత్త జంట

మరో జానపద పాటకు ఊరేగింపులో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఊర మాస్ గా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏం ఎనర్జీరా బాబు. ఊర మాస్ డ్యాన్స్ అదుర్స్ అంటూ ఆ వీడియోకు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా పోటీ పడి మరీ చేసిన ఆ కొత్త జంట పెళ్లి డ్యాన్స్ వీడియోను చూసేయండి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి