Home » News » Bride Dance Video Viral
News

Viral Video : ఫుల్ జోష్ లో పెళ్లి కూతురు.. మండ‌పానికి వ‌స్తూనే అదిరిపోయే డ్యాన్స్

Authored By
mallesh
The Telugu News | Updated on: June 2, 2022 12:07 am
Advertisement

Viral Video: పెళ్లంటే ఆ సంద‌డి మామూలుగా ఉండ‌దు. ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ.. ఫ్రెండ్స్ ఆట ప‌ట్టిస్తూ సంద‌డి చేస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లికూత‌రు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే ట్రెండింగ్ లో ఉంది. ఒక‌ప్పుడు పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ త‌ల‌దించుకుని ఉండేవారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు. ఎంత మంది ఉన్నా భ‌య‌ప‌డ‌కుండా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Advertisement

కొంత మంది పెళ్లి కూతుర్లు ఏకంగా మండ‌పానికి వ‌స్తూనే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఇక పెళ్లి త‌ర్వాత జ‌రిగే బ‌రాత్ కార్య‌క్ర‌మంలో, రిసెప్ష‌న్ లో స్టేజిపై పెళ్లికొడుకుతో క‌లిసి ఆడిపాడుతున్నారు. మామూలుగానే అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఇక సంద‌ర్బం వ‌స్తే త‌మ టాలెంట్ తో దుమ్ములేపుతారు. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ వైర‌ల్ అవుతున్నారు. నెట్టింట్ల ఇప్ప‌టికే వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తున్న‌వీడియోలు వేల‌ల్లో ఉన్నాయి. ఈ డ్యాన్స్ వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతూ ఆక‌ట్టుకుంటున్నాయి.

Bride Dance video viral

Advertisement

ఇక ఆ మ‌ధ్య ఓ జంట ట్రెండింగ్ సాంగ్ నీ.. బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. డుగ్గు డుగ్గు డుగ్గు.. అని సాంగ్ కి స్పెప్పులేయ‌డంతో తెగ పాపుల‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం అలాంటి వీడియోనే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. మండ‌పంలో పెళ్లి కొడుకు కూర్చుని ఉండ‌గా పెళ్లి కూతురు మండపానికి వ‌స్తూ నీ.. బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. డుగ్గు డుగ్గు డుగ్గు.. సాంగ్ కి స్టెప్పులేస్తూ ఆక‌ట్టుకుంది. దీంతో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు వావ్ సూప‌ర్, ఎంట్రీ వేరే లెవ‌ల్ అంటూ కామెంట్ల‌తో ప్ర‌శంసిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వీడియోల‌కు రెండు ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి