Home » News » Bride Mass Dance Video In Viral
News

Viral Video : పెళ్లి కూతురు క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో పెళ్లికొడుకు ఫిదా.. డ్యాన్స్ వీడియో వైర‌ల్

Authored By
mallesh
The Telugu News | Published on: June 10, 2022, 7:40 am
Advertisement

Viral Video: అమ్మాయిలు సంద‌ర్భం ఏదైనా డ్యాన్స్ చేసే చాన్స్ వ‌స్తే మాత్రం అస్స‌లు వ‌దులుకోరు. స్కూల్, కాలేజ్ ఫంక్ష‌న్స్ మొద‌లు ఇంట్లో ఫంక్ష‌న్స్, మ్యారేజెస్ ఎక్క‌డైనా త‌మ టాలెంట్ చూపిస్తున్నారు. ఇక పెళ్లి కూత‌రు గెట‌ప్ లో అమ్మాయిలు అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఇలా కొన్ని వేల‌కొద్ది వీడియోలు సంద‌డి చేస్తున్నాయి.. డైలీ వంద‌ల కొద్ది డ్యాన్స్ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.. అంద‌రూ వీటినే ఎక్కువ ఆస‌క్తితో చూస్తుంటారు. కామెంట్స్, లైకులు కొడుతూ వైర‌ల్ చేస్తుంటారు.

Advertisement

కాగా పెళ్లిలో పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ఎక్కువ‌గా సంద‌డి చేస్తుంటాయి. వీటిని చూసి ఎంతో మంది అమ్మాయిలు త‌మ పెళ్లిలో ఇదే ట్రెండ్ కొన‌సాగిస్తున్నారు.ప్ర‌తిపెళ్లిలో వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేయ‌డం ఆ పెళ్లికే సంద‌డి తెస్తున్నారు. ఎంగేజ్ మెంట్ కి అంద‌రూ ఒక చోట చేరి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తుంటే డీజే సాంగ్స్ కి కొత్త‌జంట డ్యాన్స్ తో సంద‌డి చేస్తున్నారు. అలాగే పెళ్లి మండపంలో.. రిసెప్ష‌న్ స్టేజ్ పై.. బ‌రాత్ లో మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు.

Advertisement

అబ్బాయిలు ఎంతో కొంత సిగ్గుప‌డుతున్నా అమ్మ‌యిలు మాత్రం ఎలాంటి జంకు లేకుండా డ్యాన్స్ చేస్తూ వీడియోల‌కు, ఫొటోల‌కు ఫోజులిస్తూ జ్ఞాప‌క‌ల‌ను ప‌దిలంగా దాచుకుంటున్నారు.ప్ర‌స్తుతం ఓ పెళ్లి కూతురు బుల్లెట్టు బండెక్కి.. సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ తెగ సంద‌డి చేస్తోంది. చుట్టూ ఎంత‌మంది ఉన్నా ఎలాంటి జంకు లేకుండా పెళ్లి కొడుకుని కూడా డ్యాన్స్ చేయ‌మ‌ని అడుగుతూ ఆక‌ట్టుకుంటోంది. చిన్న‌పిల్ల‌ల‌తో క‌లిసి క‌లిసి క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆక‌ట్టుకుంటోంది. పెళ్లికొడుకు సిగ్గుప‌డుతుండ‌గా పెళ్లి కూతురు స్మైల్ ఇస్తూ త‌న డ్యాన్స్ తో క‌ట్టిప‌డేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి