Home » News » Buffalo Scare The Snake Viral Video
News

Viral Video : గేదె పైకి దూసుకెళ్లిన పాము.. కాపాడకుండా యజమాని ఏం చేశాడో చూడండి .. వైరల్ వీడియో..!!

Authored By
aruna
The Telugu News | Published on: October 24, 2023, 12:00 pm
Advertisement

Viral Video : పాములంటే మనుషులే కాదు జంతువులు కూడా భయపడతాయి. అవి కూడా పాములతో చాలా జాగ్రత్తగా ఉంటాయి. పెద్దపెద్ద జంతువులు కూడా పాములను చూసి భయపడతాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఓ చిరుత పులి కూడా పామును చూసి భయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ గేదే కూడా పామును చూసి చాలా భయపడిపోయింది. అయితే ఆ సమయంలో గేదెను కాపాడాల్సిన యజమాని ఆ పని మానేసి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదే చెట్టుకు కట్టేసి ఉంది. ఆ సమయంలో ఓ పాము వేగంగా గేద వైపు దూసుకెళ్లింది. దీంతో గేదె బెదిరిపోయింది. గేదె దగ్గరకు వెళ్లిన పాము బుసలు కొట్టడం ప్రారంభించింది. దీంతో గేదె పామును చూసి ఇంకా బెదిరిపోయింది. అయితే కట్టేసి ఉండడం వలన గేదే తప్పించుకోలేకపోయింది. ఆ గేదెను కాపాడాల్సిన వ్యక్తి వీడియో చేస్తూ ఉండిపోయాడు. చివరకు ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాపాడాల్సిన యజమాని గేదె దగ్గరికి వెళుతున్న పాముని వీడియో తీయడం కాకుండానే దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది.

Buffalo scare the snake viral video

Advertisement

ఇప్పటిదాకా ఈ వైరల్ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. 9.5 లక్షల మందికి పైగా లైక్స్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తీస్తున్న వ్యక్తికి హృదయం అనేది లేదు అనుకుంటా అని కొందరు, వీడియో తీయాలనే కోరిక అతడి మానవత్వాన్ని చంపేసింది అని మరికొందరు, ఆ గేదె అదృష్టం బాగుంది, ఆ పాము కాటు వేయలేదు అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికైతే గేదె పాము బారి నుంచి తప్పించుకుంది. పాము కనుక కాటేస్తే దాని పరిస్థితి ఏమయ్యేదో అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి