Home » News » Janhvi Kapoor Glamorous Video
News

Janhvi kapoor : బ్లాక్ డ్రెస్ లో జాన్వీకపూర్ అందాలు.. బాబోయ్ అరుపులే.. వీడియో

Authored By
aruna
The Telugu News | Published on: February 1, 2024, 6:00 pm
Advertisement

Janhvi kapoor : దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.ధడక్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్టు పడటం లేదు. కానీ తన గ్లామర్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ పెట్టే ఫోటోలకు వేలల్లో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో ఈ బ్యూటీ సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తుంది. అయితే ప్రెసెంట్ గా జాన్వీ కపూర్ బ్లాక్ కలర్ డ్రెస్సులో కోహినూర్ డైమండ్ల మెరిసిపోయింది. ఈ మోడల్ అవుట్ ఫిట్ లో బాలీవుడ్ స్టార్ కిడ్ హాలీవుడ్ హీరోయిన్లను తలపించింది. తన అంద చందాలతో పాటు ఒంపు సొంపులు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Advertisement

రీసెంట్గా బాలీవుడ్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ జరిగాయి. ఈ ఈవెంట్ కు జాన్వీ కపూర్ బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రెండో షెడ్యూల్లో భాగంగానే రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొనబోతోంది. ఈ సినిమా తర్వాత ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని రీసెంట్ గా చెప్పింది. అయితే సూర్య , జాన్వి కపూర్ జోడిగా కర్ణ సినిమా మహాభారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని చేస్తున్న సినిమా. ఇందులో జాన్వీ కపూర్ కి ఏ పాత్ర ఇస్తారు అనే విషయం మాత్రం బయటికి రాలేదు. భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతుంది.

ఇక జాన్వీ దేవర సినిమాతో పాటు తెలుగులో మరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. అఖిల్ ఏజెంట్ తర్వాత వంశీ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేయనున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని అనుకున్నారట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్ కి ఛాన్స్ వచ్చినట్లు టాక్. దీంతో ఈ బ్యూటీ కి తెలుగులో వరుస అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తన తల్లి శ్రీదేవి లాగా తెలుగు ప్రేక్షకులను జాన్వీ కపూర్ మెప్పిస్తుందో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి