Krithi Shetty : సన్నని నడుముతో కృతి శెట్టి బెల్లీ డాన్స్ అదుర్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!
Krithi Shetty : ‘ ఉప్పెన ‘ Uppena Movie సినిమాతో టాలీవుడ్ Tollywood ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి Krithi Shetty ఆ ఒక్క సినిమాతో స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలో నటిస్తూ బిజీగా మారారు. అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించి దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇటీవల తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ‘ కస్టడీ ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే కృతి శెట్టి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ భామ బెల్లీ డాన్స్ చేస్తూ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో కృతి శెట్టి బెల్లీ డాన్స్ తో నడుమంతా ఊపుతూ అద్భుతంగా డాన్స్ వేశారు. నడుమును బొంగరంలా తిప్పుతూ బెల్లీ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతి శెట్టి తెలుగులో చివరిగా నటించిన సినిమా కస్టడీ. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ బ్యూటీ కి తెలుగులో మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే శర్వానందుతో ఓ సినిమాలో నటిస్తుండగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా రాబిన్ హుడ్ లో కూడా కృతి శెట్టి ఓ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక వీటితోపాటు కొన్ని తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో బంగార్రాజు తర్వాత ఆమె ఖాతాలో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోలు వీడియోలతో ఎల్లప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటూ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. దీని ద్వారా సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఈసారైనా వచ్చే సినిమాతో కృతి శెట్టి సూపర్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.