Home » News » Mla Humiliate Farmer In Rajasthan Video Viral
News

Viral Video : సాయం కోసం వచ్చిన రైతును తన్ని అవమానించిన ఎమ్మెల్యే.. ఇలాంటి ఎమ్మెల్యేలకు ఓట్లేద్దామా.. వీడియో వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 18, 2023, 2:00 pm
Advertisement

Viral Video : ఇది ఎన్నికల సీజన్. ప్రస్తుతం తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే ఆ రైతును చాలా హీనంగా చూస్తాడు. వీడేంటి.. వీడి అవతారం ఏంటి అన్నట్టుగా ఆ రైతు అతడిని చూస్తాడు. సాయం కోసం వచ్చిన రైతును తన్ని అవమానిస్తాడు ఆ ఎమ్మెల్యే. ఆ ఘటన ఎమ్మెల్యే ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

సాయం కోసం వచ్చిన ఒక రైతును అలా తన్ని అవమానిస్తారా? రైతు అంటే ఈ దేశానికే వెన్నెముక. అలాంటి రైతుపై ఇలా ప్రవర్తిస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉండటంతో సాయం కోసం వచ్చిన రైతును తన్ని అవమానించిన ఆ ఎమ్మెల్యే ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే అది ఇక్కడి వీడియో కాదు. రాజస్థాన్ కు చెందిన వీడియో. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేంద్ర సింగ్ అనే ఎమ్మెల్యే దగ్గరికి ఓ రైతు వస్తాడు. సాయం కోసం వచ్చి తనను అభ్యర్థిస్తాడు. దీంతో ఆ రైతుపై దురుసుగా ప్రవర్తించి నా ఇంట్లోకే వస్తావా? నీకు సాయం కావాలా అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. కాలితో తంతాడు.

#image_title

Advertisement

Viral Video : పాత వీడియో అయినా ఎన్నికల నేపథ్యంలో వైరల్

నిజానికి ఈ ఘటన 2021 లో జరిగింది. కానీ.. ప్రస్తుతం రాజస్థాన్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలో ప్రజలు తెలుసుకోవాలని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి