old man viral video
viral video : బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే లూలూ మాల్ లో ఓ వ్యక్తి మహిళను శారీరకంగా, లైంగికంగా వేధించిన వీడియో ఇప్పుడు బయటికి రావడంతో వైరల్ గా మారింది. పాత మైసూర్ రోడ్డు లోని గోపాలపురం లూలూ మాల్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంగా మాల్ లో ఉన్న యశ్వంత్ అనే వ్యక్తి అతడి ఫోన్లో వీడియో తీసి instagram లో షేర్ చేశాడు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైరల్ అయిన వీడియోలో మాల్లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మహిళ వెనుక భాగాన్ని తాకటం కనిపించింది. ఈ సంఘటన ఆదివారం లూలూ మాల్ ఫాంటరా లో జరిగింది…
ఈ వీడియోలోని ఓ వ్యక్తి అమ్మాయిల తో ఈ రకంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాడని సోషల్ మీడియాలో యశ్వంత్ పోస్ట్ చేశాడు. రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళలు, యువతులు వెంట వెళుతున్న అతడిని చూసినప్పుడు మొదట నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నేను వీడియో రికార్డు చేశాను. అతడిని నేను అనుసరించాను అని వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఈ ఘటనపై మాల్ లోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. అయితే సెక్యూరిటీ గార్డులు వచ్చే సమయానికి ఆ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని పోలీసు అధికారులు అంటున్నారు.
బెంగళూరు పోలీసులు సోషల్ మీడియా లోని పోస్ట్ పై స్పందించారు. వీడియోలోని వ్యక్తి పై ఫిర్యాదు చేయటానికి వీడియో షేర్ చేసిన వ్యక్తి తమను సంప్రదించాలని యశ్వంత్ కి పోలీసులు మనవి చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో బెంగళూరు లోని పోలీసులు ఫిర్యాదు తీసుకొని విచార చేపట్టినట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేస్తే మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ ఉంటారని కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగ డిమాండ్ చేస్తున్నారు.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.