Parents : ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది జనాలు మరిచినట్లుగా ఉన్నారు. రోజురోజుకి జనాలలో మానవత్వం అనేది నశించిపోతుందా అంటే నిజమే అని చెప్పాలి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. పైసకు ఉన్న విలువ మనిషికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఉంటే చాలు బంధుత్వాలు అవసరం లేదని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బిడ్డలు వారిని భారంగా మోస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాలకు పంపిస్తున్నారు. మరి కొందరు ఆ మాత్రం కనికరం కూడా చూపడం లేదు. ఇంకొందరు ఆస్తుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నవారు ఉన్నారు.
తాజాగా అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్తికోసం కొడుకు తన తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సోదరుడికి భూమి ఎలా రాశారు అంటూ తల్లి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కాలితో తన్నుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తండ్రిని చంప మీద కొట్టి తిడుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె నీరుగట్టువారి పల్లెలో జరిగింది. తల్లిదండ్రులపై కొడుకు దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను కొట్టిన కొడుకు బాగు పడినట్లు చరిత్రలో లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆస్తికోసం తల్లిదండ్రులకు విచక్షణారహితంగా దాడి చేయడం పై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇలా బాధించడం ఏమాత్రం సరైనది కాదు అని, చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉంటారు. తమ బిడ్డలు చల్లగా ఉండాలని తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి వారిని ప్రయోజకులను చేస్తే చివరికి ఇలా బిడ్డలు తల్లిదండ్రులనే హింసించే స్థితికి వస్తున్నారు. చిన్నప్పటినుంచి సాధినందుకు, పెంచినందుకు కొడుకే తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి. అంతేకానీ ఇలా ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం సరైనది కాదు. తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు బాగుపడినట్లు చరిత్రలో లేదని పెద్దలు అంటున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.