Sri Reddy : శ్రీరెడ్డి ఎమోషనల్ వీడియో.. జగన్ జ్ఞాపకాలని బెడ్ కింద దాచేసిందిగా..!
Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ అమ్మడు పెద్ద స్టార్ నటి కాదు, అయినప్పటికీ తన చేష్టలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాని ఉపయోగించుకొని తెగ సందడి చేస్తుంటుంది. ఆమె పవన్ కళ్యాణ్‌తో పాటు టీడీపీ నాయకులని తిడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో ఫుల్ ఫేమస్ అయ్యిన శ్రీరెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు క్యూ కట్టేవారు. శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్స్ చేసేవారు .
వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శ్రీరెడ్డి… వైఎస్ఆర్ సీపీకి ఎప్పుడూ మద్దతునిచ్చి మాట్లాడేది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణంరాజులపై మామూలుగా విరుచుకుపడలేదు. వ్యక్తిగత దూషణలు ఒక్కో సారి పరిధి కూడా దాటిపోతాయి. అసభ్య పదజాలంతో, ఏక వచన ప్రయోగంతో టార్గెట్ చేస్తుంటుంది శ్రీరెడ్డి. సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ నేతను జగన్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. జగన్ ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా వాళ్లపై తనదైన శైలిలో అసభ్య పదజాలంతో వాళ్లను పబ్లిక్ గా తిట్టేస్తుంటుంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ తప్పకుండా గెలిచి తీరతాడని అప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ మొహం ఎక్కడో పెట్టుకుంటారని ఓపెన్ చాలెంజ్ లు చాలానే చేసింది.
Sri Reddy : శ్రీరెడ్డి ఎమోషనల్ వీడియో.. జగన్ జ్ఞాపకాలని బెడ్ కింద దాచేసిందిగా..!
జగన్ మొన్నటి ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలవడంతో కొంత కాలం సైలెంట్ గానే ఉన్న శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. తాజాగా కోట్లాది మందికి మంచి చేసిన ఆ అభిమానం, ఆప్యాయతలు ఏమయ్యాయి నీమీద అంటూ నిన్నే తలచుకుంటూ నీ జ్ణాపకాలను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. అంటూ జగన్ సంక్షేమ పథకాల కరపత్రాలను బెడ్ కింద దాచిపెట్టిన వీడియోను షేర్ చేసింది. అది చూసి శ్రీరెడ్డిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. అయ్యో పాపం జగన్ మీద అంతలా ప్రేమ పెంచుకున్నావా శ్రీరెడ్డీ. జ్ఞపకాలను భద్రంగా దాచుకో..మళ్లీ జగన్ వచ్చేదాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ సారి జగన్ మళ్లీ సీఎం అయితే నీకు హోం మంత్రి ఇస్తారేమో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
This website uses cookies.