Viral video : వేట ఎప్పుడూ ప్రత్యేకమే. అది ఒక వైపు ఒక జీవి ప్రాణాన్ని తీసేస్తుంది. మరోవైపు ఇంకో జీవి ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంది. ఏ జంతువు అయినా సరే వేటలో ఆహారం కావడం ఎన్నోసార్లు చూస్తున్నాం. ఇక అడవిలో అయితే ఇలాంటి వేటకు సమయం, సందర్భం అంటూ ఏమీ ఉండవు. ఎప్పుడు ఏ జంతువు ఎటు నుంచి వచ్చి దాడిచేస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. అయితే ఈ వేట కేవలం అడవిలో మాత్రమే కాదండోయ్ జీవి ఎక్కడ ఉంటే అక్కడ కచ్చితంగా సాగుతూనే ఉంటుంది. మానవ సమాజంలో బతుకుతున్న వాటిల్లో కూడా ఇది ఉంటుంది.
మన మధ్య ఉండే తొండ, పాము నుంచి మొదలు పెడితే సరీ సృపాల్లో ఈ వేట కచ్చితంగా ఉంటుంది. అయితే వేటకు సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు కూడా వేటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే నిజంగానే షాక్ అయిపోతారు. మనం ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో గనక చూస్తే ఓ గోడ మీద రెండు తొండలు ఆడుకుంటూ ఉన్నాయి. అయితే ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన పాము తొండపై దాడి చేసింది.
ఇక ఆ పాము ధాటి నుంచి తప్పించుకునేందుకు తొండ ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయినా సరే ఆ పాము మాత్రం విడిచి పెట్టకుండా ఉండటంతో అక్కడే ఉన్న మరో తొండ అలెర్ట్ అయిపోతుంది. వెంటనే పాము మీద అకస్మాత్తుగా దాడిచేస్తుంది. ఇంకేముంది ఆ దాడి నుంచి ఆ పాము తేరుకునేందుకు ప్రయత్నించి వెంటనే అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించడం మనం చూడొచ్చు. కాగా ఈ పోరాటం మొత్తం గోడ మీదే జరుగడం మనం చూడొచ్చు. ఇదంతా కూడా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు కావడంతో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.