Home » News » Turtle And Cat Fight Video Viral
News

Viral Video : వామ్మో ఇది మామూలు తాబేలు కాదు.. పిల్లిని ఏం చేసిందో చూడండి

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 2, 2021 12:55 pm
Advertisement

Viral Video : సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. కానీ.. తాబేలుకు ఉన్న బలం, దాని విశిష్టత చాలామందికి తెలియదు. చిన్నప్పుడు మనం తాబేలు, కుందేలు స్టోరీ చదువుకున్నాం కదా. ఆ స్టోరీలో తాబేలు, కుందేలు పరుగుపందెం పెట్టుకుంటాయి. కానీ.. చివరకు మెల్లగా నడిచే తాబేలు పరుగుపందెంలో గెలుస్తుంది.

Advertisement

అందుకే పెద్దలు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనకు చెబుతుంటారు. తాబేల మెల్లగా నడిచినా.. అది చాలా బలమైన జీవి. దాని ఆయుష్షు కూడా గట్టిదే. తాబేలు కనీసం వెయ్యి ఏండ్లు బతుకుతుంది. అలాగే వాటికి ధైర్యం కూడా ఎక్కువే.

turtle and cat fight video viral

Advertisement

Viral Video : పిల్లిని ఈ తాబేలు ఎలా పరుగులు పెట్టించిందో చూడండి

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ తాబేలు, పిల్లి రెండింటి మధ్య ఫైట్ కు సంబంధించిన వీడియో అది. షార్ట్ వీడియో అయినప్పటికీ ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గోడ పక్కన కూర్చొని ఉన్న ఓ పిల్లిని తాబేలు చూస్తుంది. నెమ్మదిగా పిల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుంది తాబేలు. ఆ.. ఇది నన్నేం చేస్తుందిలే అని అనుకొని ఉంటుంది పిల్లి. ఇంతలో తాబేలు.. పిల్లి మీద దూకేస్తుంది. దీంతో పిల్లికి భయం వేసి.. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుతుంది. వామ్మో.. తాబేలు చూస్తే ఎంత అమాయకంగా ఉంది.. పిల్లిని ఎలా పరుగులు పెట్టించింది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Explore | Adventure | Travel (@wonderfuldixe)

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి