
Viral Video : వామ్మో.. పెళ్లి కూతురు డాన్స్ చేయమందని కోపంతో పెళ్ళికొడుకు ఏం చేశాడో చూడండి.. !
Viral Video : ఒకప్పుడు పెళ్లిళ్లు ఎంతో సాంప్రదాయంగా, పద్ధతిగా జరిగేవి. కానీ ఇప్పుడు మారిన కాలం తో పెళ్లి అనేది ఒక ఎంజాయ్మెంట్ గా మారింది. అప్పట్లో పెళ్లి అంటే వధూవరులు ఇద్దరు బిడియంతో ఉండేవారు. కానీ మారుతున్న కాలంతోపాటు అటువంటివన్నీ మారిపోయాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లికూతురు వారి వివాహ వేడుకను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి బిందెలో ఉంగరాలు తీయడం, తలంబ్రాలు చల్లుకోవడం, డాన్స్ చేయడం, స్నేహితులను ఆటపట్టించడం ఇలా అన్నీ హాస్యాస్పదంగా సరదాగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అందరూ షాక్ అవుతారు.
ఈ వీడియోలో పెళ్లికూతురు డాన్స్ చేసేందుకు ప్రేమతో వరుడు దగ్గరకు వస్తే చివరికి వరుడు ఏ చేసాడో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో లో అప్పుడే పెళ్లయిన కొత్త జంట వారి చుట్టూ కొంతమంది స్నేహితులు కనిపిస్తూ ఉంటారు. వివాహ వేడుకలో భాగంగా వధూవరుల ఎదుట వారి స్నేహితులు డాన్స్ చేస్తున్నారు. కొంత సమయానికి వారితోపాటు పెళ్లికూతురు కూడా డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. అలా కొత్త సేపు డాన్స్ చేసిన తర్వాత అక్కడున్న వారంతా వధూవరులు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలని బలవంతం చేస్తారు. దీంతో అయిష్టంగానే పెళ్ళికొడుకు ముందుకు వస్తాడు. అప్పుడు పెళ్లికూతురు ప్రేమగా వరుడి దగ్గరికి వెళ్లి డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వరుడు మాత్రం డాన్స్ చేయడానికి అంత ఇష్టం చూపించడు.
అయినా సరే పెళ్లి కూతురు వరుడిని వదలకపోవడంతో వరుడు ఒక్కసారిగా వైలెంట్ గా ప్రవర్తించడం మొదలుపెట్టి వధువుపై అరిచేస్తూ వధువుని గిరగిరా తిప్పి కింద పడేస్తాడు. అక్కడితో ఆగకుండా ఆ పెళ్ళికూతురు పైన అక్కడున్న వారిపై కోపంగా అరిచేసాడు. పెళ్లికూతురుని పట్టుకుని ఇలా ఎవరైనా డాన్స్ చేస్తారా అంటూ ఆమెను కూడా ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న యువకులు వరుడుని పట్టుకొని పక్కకు తీసుకువెళతారు. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం వైలెంట్ గా మారిపోతుంది. వరుడి వైలెంట్ బిహేవియర్ కు అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.