Home » News » Viral Video Cell Phone Addicted Child Hitting His Mother With Bat
News

Viral Video : సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని బ్యాట్ తో కొట్టిన పిల్లాడు.. వీడియో వైరల్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: October 4, 2024 12:44 pm
Advertisement

Viral Video : పిల్లలకు ఈమధ్య ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయ్యిందో తెలిసిందే. చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి వారిని అన్నం తినేలా చేస్తున్నారు. ఏదైనా వాళ్లు అలకగా ఉంటే చాలు, లేదా డల్ గా కనిపిస్తే చాలు ఫోన్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఐతే దీని వల్ల వారికి ఎలాంటి నష్టం జరుగుతుందో గుర్తించలేకపోతున్నారు. ఐతే కొందరు పిల్లలైతే సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయ్యి ఇంట్లో వాళ్ల మీదే ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి చాలా చూశాం లేటెస్ట్ గా తల్లి ఫోన్ తీసుకుని ఇవ్వలేదని బ్యాట్ తో తల పగలగొట్టిన వీడియో ఒకటి వైర్ల్ అయ్యింది.

Advertisement

ఫోన్ చూస్తున్న పిల్లాడిని మందలించి ఫోన్ చేతులోంచి తీసుకుని బుక్ ఇచ్చి చదవమన్నది ఒక తల్లి. ఐతే ఆమె పిల్లాడు చదువుతున్నాడు కదా అని ఏదో పనిచేస్తూ ఫోన్ మాట్లాడుతుంది. ఐతే అదే అదునుగా చూసి పక్కనే ఉన్న బ్యాట్ తో తల్లి తల మీద కొట్టాడు ఆ పిల్లాడు. ఫోన్ ఇవ్వలేదన్న కోపం తో అలా చేశాడని తెలుస్తున్నా.. తల్లి అని అనేది చూడకుండా ఆమెకు గాయం చేయడం అనేది అతను ఫోన్ కి ఎంత ఎడిక్ట్ అయ్యాడన్నది అర్ధం అవుతుంది.

Viral Video ఫోన్ కోసం బ్యాట్ తో కొట్టాడంటే..

ఐతే తల మీద బ్యాట్ తో కొట్టగా ఆమె ఒక్కసారి స్ప్రుహ కోల్పోయింది. ఐతే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మ ఏం చెప్పినా పిల్లల మంచికే అన్నది మర్చిపోయి పిల్లలు ఇలా ఉన్మాదులుగా మారుతున్నారు. ఈ వీడియోలో చూసిన ఆ తల్లి కి ఏమైంది. ఆ పిల్లాడి భవిష్యత్తు ఏంటన్నది ఆలోచిస్తే భయంగా ఉంది.

Advertisement

Viral Video : సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని బ్యాట్ తో కొట్టిన పిల్లాడు.. వీడియో వైరల్..!

పిల్లాడి సెల్ ఫోన్ కోసం అమ్మని గాయ పరిచాడు అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ వీడియో ఎక్కడ జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అందరు ఈ వీడియో చూసి అయ్యో పాపం అనేస్తున్నారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి