Home » News » Viral Video Man Adventure To Python
News

Viral Video : ఫుల్లుగా తాగి కొండ చిలువతో సాహసం .. చివరకు అది ఏం చేసిందో చూడండి..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 24, 2023 10:33 am
Advertisement

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింపజేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోల ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇంకా మరి కొన్ని వీడియోలు భయానకంగా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కాస్త భయానకంగానే ఉంది. ఇందులో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగేసి కొండచిలువతో సాహసం చేయబోయాడు. కానీ చివరకు అది ఊహించని సంఘటనగా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ ఘటన కేరళలోని కన్నూరులో జరిగింది. ఓ వ్యక్తి మద్యం ఫుల్లుగా తాగి కొండ చిలువతో సాహసం చేయబోయాడు. అసలు కొండచిలువ ను చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది ఆ వ్యక్తి దాంతో ఫోటో దిగాలని ప్రయత్నించాడు. కానీ చివరికి అది అతడి మెడను చుట్టుకుంది. దీంతో అతడికి ఊపిరి ఆడక కింద పడిపోయాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఎలాగోలా కొండచిలువను లాగేసారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Viral Video Man adventure to python

Advertisement

ఇక ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన జంతువులతో సాహసం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరు, మద్యం మత్తులో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో అతడికి అర్థం కాలేదు అని ఇంకొందరు, కొంచెం సేపు అయితే అతడు ఊపిరాడక చనిపోయేవాడే అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. ఇప్పటిదాకా ఈ వీడియోను లక్షల మందికి పైగా వీక్షించారు. వేలల్లో కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి