Viral Video : కలిచి వేసే సంఘటన.. బతుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!
Viral Video : ఈ ప్రపంచంలో మనిషి తన జీవితాన్ని సాఫీగా నడిపించుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఫేస్ చేయాల్సి వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఓ వైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మూడు పూటలు తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలీ చాలనీ జీతాలతో సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు. ఏ ఉద్యోగం లేని వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఒడిషాలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ 40 ఏండ్ల ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు.
ఎప్పటిలాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి వర్షం పడుతుండడంతో ఒక దగ్గర ఆగాడు. ఇంతలోనే గుండెపోటు రావడంతో బండి మీదే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా తినుబండారాలు అమ్మడానికి బయలుదేరాడు. కాసేపు వీదుల్లో తిరిగాడు. ఆ తర్వాత అతడు బండిమీద నిద్ర పోతున్నట్లు కనిపించాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు అతన్ని చూస్తూ వెళ్తున్నారు. అయితే ఆ వ్యక్తిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.సదరు వ్యక్తి దగ్గరకు వచ్చిన కొందరు అతన్ని పిలిచిచినా.. కదిలించి చూసినా ఉలుకూ పలుకూ లేదు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Viral Video : కలిచి వేసే సంఘటన.. బతుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. హుటా హుటినా ఆసుపత్రికి తరలించగా.. వాహనంపై కూర్చొని ఉండగానే గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బతుకు బండిని లాగించిన ఆ బండిమీదనే గుండెపోటుతో మరణించడంతో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రాణం నీటి మీద బుడగలాంటిదని ఎప్పుడు చిట్లి పోతుందో ఊహించలేమని ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్‌గా కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు అతడి కుటుంబం పరిస్థితి ఏంటో అని అందరు ఆలోచన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.