Home » Exclusive » Viral Video This Pigeon Is Not Normal
Exclusive

Viral Video : ఈ పావురం సాధారణమైనది కాదు.. వీడియో వైరల్!

Authored By
mallesh
The Telugu News | Published on: January 30, 2022, 5:30 pm
Advertisement

Viral Video : ప్రకృతి మనకు ప్రసాదించిన జీవరాశుల్లో పావురాలు ఒకటి. వీటిని చాలా మంది తమ ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. కొందరైతే వీటితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు. తమకు నచ్చిన పావురాలకు పేర్లు పెట్టుకుని పిలుచుకుంటుంటారు. పావురాలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. వీటి మధ్య కూడా మనుషుల వలే ప్రేమానురాగాలు ఉంటాయట.. ఆడ, మగ పావురాలు ఒకే చోట చేరి సౌండ్స్ చేస్తుంటే రచయితలు వాటిని చూస్తూ ఏకంగా స్టోరీలు, సాంగ్స్ రాసేస్తుంటారు. లవ్‌కు వీటిని సింబల్స్‌గా చూపిస్తుంటారు. కొందరు తాము ప్రేమించి వ్యక్తులకు నిజమైన పావురాలను గుర్తుగా ఇస్తుంటారు. మరికొందరు వాటిని బొమ్మలను అందిస్తుంటారు.

Advertisement

పూర్వం పావురాలను ప్రేమ సందేశం, శాంతి సందేశాలకు వాడేవారు రాజవంశీయులు. పూర్వం లెటర్స్, మొబైల్స్, వాట్సాప్, మెయిల్స్ వంటివి లేని రోజుల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి పావురాలతో పాటు ఇతర పక్షులను వినియోగించుకునేవారు. ప్రేమసందేశాలకు మాత్రం ఎక్కువగా పావురాలను ఉపయోగించేవారని ప్రసిద్ధి.. పావురాలను శాంతికి చిహ్నంగా కూడా భావిస్తుంటారు. అందుకే నెహ్రూ కాలంలో శాంతికపోతాలను ఎగరేసేవారని చరిత్ర చెబుతోంది. పావురాలను కొందరు పెంచుకుంటే మరికొందరు వాటిని ఆటల పోటీల్లో కూడా వాడుతుంటారు.

Viral Video this pigeon is not normal

Advertisement

Viral Video : ప్రేమ సందేశానికి గుర్తు

తమిళనాడు రాష్ట్రంలో ప్రతిఏటా పావురాల పోటీలు జరుగుతుంటాయని తెలుస్తోంది. గాల్లోకి ఎగిరాక పావురాలు పల్టీలు కొట్డడం ఈ ఆటలో కీలక భాగం. ఎవరి పావురం ఎక్కువగా పల్టీలు కొడితే వారిది విజయం సాధించినట్టు.. తాజాగా ఇటువంటి పోటీలకు సంబంధించిన పల్టీలను ఒక పావురం చేసి చూపించింది. నేలపై నిల్చుని వరుసగా మూడు సార్లు పావురం బ్యాంక్ జంప్ వేసింది. దీనికి ఫైజిన్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి