Home » Amaravathi » Cpf India Company President Vice President Met Ap Cm Jagan
amaravathi

Amaravati.. సీఎం జగన్‌తో సీపీఎఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ

Authored By
praveen T
The Telugu News | Updated on: September 24, 2021 3:25 pm
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని సీపీఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.గోపీనాథ్ ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.30 లక్షల డిమాండ్ డ్రాఫ్టును అందజేశారు. సీఎం జగన్ కంపెనీ వారిని ఈ నేపథ్యంలో అభినందించారు. కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నితీరోగ్ ఫోనె ప్రాసెర్ట్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సీపీఎఫ్ కంపెనీ సహకారం అందిస్తుందని తెలిపారు.

Advertisement

ఇకపోతే సీఎం జగన్ శుక్రవారం క్యాంపు ఆఫీసులో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు సమచారం.

Advertisement

cpf india company president, vice president met ap cm jagan

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి