Naga Chaitanya : గత కొన్ని రోజులు సోషల్ మీడియాను సమంత నాగ చైతన్య విడాకుల రూమర్లు ఊపేస్తున్నాయి. రోజు కో కొత్త రకమైన వార్తలు ఆ ఇద్దరి మీద వస్తున్నాయి.కానీ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఆ రూమర్లపై నాగ చైతన్య గానీ, సమంత గానీ స్పందించడం లేదు. ఇక సమంత అయితే పరోక్షంగా కొన్ని నీతి సూక్తులు, వేధాంత ధోరణి మాటలు, పరోక్షంగా ప్రేమను తెలిపే కొటేషన్లను షేర్ చేస్తోంది. వాటి ఉద్దేశ్యం ఏంటో సమంతకు మాత్రమే తెలియాలి.
ఇక నాగ చైతన్య అయితే సోషల్ మీడియాకు కిలో మీటర్ల దూరంలో ఉంటాడు. తన సినిమా రిలీజ్ సమయంలోనే కాసింత యాక్టివ్‌గా ఉంటాడు. ఇక మిగిలిన టైంలో వాటి జోలికే పోడు. అలాంటి చై.. తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..
సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై స్పందించాడు. కెరీర్ ప్రారంభంలో రూమర్లు బాగా వచ్చేవి. ఆ సమయంలో చాలా ఫీలయ్యాను. ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తుంటారు? అని బాధపడ్డాను. అప్పట్లో సితార వంటి మ్యాగజైన్స్ నెలకు ఒకసారి వచ్చేవి.
అప్పుడు నెలంతా వాటి గురించే మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక వార్త వస్తుంది.. మరుక్షణంలో మరో కొత్త వార్త వస్తుంది. అలా ఇప్పుడు టీఆర్పీలో కోసం రూమర్లు రాస్తున్నారు. కానీ ఎక్కువ కాలం అవి నిలబడవు. ఎప్పటికైనా నిజమైన వార్తలే నిలుస్తాయి. ఇక నేను మాత్రం నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేర్వేరుగానేచూస్తాను అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు వస్తున్న రూమర్లను కూడా తాను పట్టించుకోవడం లేదని చెప్పేశాడు. కానీ విడాకుల విషయం నిజమో, అబద్దమో మాత్రం చెప్పలేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.