Home » Andhra Pradesh » 70 Year Old Man Attempts To Rape 5 Year Old Girl
andhra pradesh

AP : ఏపీలో మరో దారుణ ఘటన : ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 22, 2026, 7:28 pm
Advertisement

AP : ఏపీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. యాదవోలు గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారుల భద్రతపై మళ్లీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోపవరం గ్రామంకు చెందిన నేకూరి ఎలీసా (70)గా గుర్తించారు. అతడు పొగాకు బ్యారెన్‌లో క్యూరింగ్ పనుల కోసం రైతు వద్దకు వచ్చినట్లు సమాచారం.

Advertisement

సాయంత్రం సమయంలో బ్యారెన్ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను గమనించి ఆమెపై అత్యాచార యత్నానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక గట్టిగా ఏడవడంతో సమీపంలో ఉన్న స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు.

AP : ఏపీలో మరో దారుణ ఘటన : ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం

Advertisement

నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటన అనంతరం బాధిత చిన్నారిని వెంటనే గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి