Ayyannapatrudu : అయ్యన్న అంత సీరియస్ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి..?
Ayyannapatrudu ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు
Ayyannapatrudu : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా సొంత నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో తాను ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నట్లు అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. తన వయస్సు ఇప్పటికే 70 ఏళ్లకు చేరుకుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ వయస్సులోనూ నిరంతరం ప్రజల్లో తిరుగుతూ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడం శారీరకంగా కష్టంగా మారిందని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇకపై కొంత ప్రశాంతంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కోసం అంకితభావంతో పనిచేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
Ayyannapatrudu : అయ్యన్న అంత సీరియస్ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి..?
Ayyannapatrudu స్పీకర్‌గా మిగిలిన కాలంలో ప్రజలకు మరింత సేవ
అయితే, తన రాజకీయ బాధ్యతలకు వెంటనే పూర్తిగా దూరం కావడం లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్‌గా తన పదవీకాలం ఇంకా దాదాపు మూడేళ్లు మిగిలి ఉందని తెలిపారు. ఈ కాలంలో ప్రజలకు, తన నియోజకవర్గానికి సాధ్యమైనంత మంచి చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నానని చెప్పారు. మిగిలిన సమయాన్ని రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి వినియోగిస్తానని వెల్లడించారు. స్పీకర్‌గా సభ గౌరవం, ప్రతిష్ఠను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై తనవంతు కృషి చేస్తానని తెలిపారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, తన చేతిలో ఉన్న బాధ్యతలను మాత్రం పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలన్నదే తన ఉద్దేశమని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.
అయ్యన్న నిర్ణయంతో నర్సీపట్నం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు?
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక ముద్ర వేసిన అయ్యన్నపాత్రుడు నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం నర్సీపట్నంతో పాటు అనకాపల్లి జిల్లా రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రకటించడం, భవిష్యత్తులో నర్సీపట్నం రాజకీయాల్లో నాయకత్వం, బాధ్యతలు, సమీకరణాలపై ఆసక్తిని పెంచుతోంది. దీంతో అయ్యన్నపాత్రుడి తాజా ప్రకటన ఉత్తరాంధ్ర టీడీపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే అంశంపై చర్చ మొదలైంది.







