Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్.. జోగి రమేష్ కుమారుడు అరెస్ట్... ఏసీబీ సోదాలతో వణుకు..!
Jogi Ramesh : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల గుండెలలో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖమాజీ మంత్రి జోగి రమేష్‌కు భారీ దెబ్బ తగిలింది అని చెప్పాలి.. ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తున్నది
అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటోన్నారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను ఆయన కోనుగోలు చేసి, విక్రయించారనే ఆరోపణలు ఇదివరకు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని విక్రయించారని, దీని ద్వారా అయిదు కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంబాపురంలో సర్వే నంబర్లు 69/2, 87లో అగ్రిగోల్డ్‌కు దాదాపు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని జోగి రమేష్ సమీప బంధువులు తమ పేరు మీద బదలాయించుకున్నట్లు చెబుతున్నారు.
Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్.. జోగి రమేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాలతో వణుకు..!
ఈ వ్యవహారంపై గతంలో జోగి రమేష్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడదే అంశం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసినట్లు సమాచారం మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు సమాచారం.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.