Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,10:58 am

ప్రధానాంశాలు:

  •  Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్... ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..!

Jogi Ramesh  : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ నాయ‌కుల గుండెల‌లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖమాజీ మంత్రి జోగి రమేష్‌కు భారీ దెబ్బ తగిలింది అని చెప్పాలి.. ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి ర‌మేష్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తున్నది

Jogi Ramesh  ఏసీబీ దాడులు..

అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటోన్నారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను ఆయన కోనుగోలు చేసి, విక్రయించారనే ఆరోపణలు ఇదివరకు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని విక్రయించారని, దీని ద్వారా అయిదు కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంబాపురంలో సర్వే నంబర్లు 69/2, 87లో అగ్రిగోల్డ్‌కు దాదాపు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని జోగి రమేష్ సమీప బంధువులు తమ పేరు మీద బదలాయించుకున్నట్లు చెబుతున్నారు.

Jogi Ramesh బిగ్ బ్రేకింగ్‌ జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్ ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు

Jogi Ramesh : బిగ్ బ్రేకింగ్‌.. జోగి ర‌మేష్ కుమారుడు అరెస్ట్… ఏసీబీ సోదాల‌తో వ‌ణుకు..!

ఈ వ్యవహారంపై గతంలో జోగి రమేష్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడదే అంశం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసినట్లు సమాచారం మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది