Allu Arjun : ఈ సారి ఏపీ రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్‌గా మారాయో మనం చూశాం. జోరుగా ప్రచారాలు, తీవ్ర విమర్శలతో రాజకీయం రచ్చగా మారింది. ఇక ప్రచారాలలో సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొనడం మరింత ఊపు తీసుకొచ్చినట్టైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఏపీ ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ తీసుకొచ్చింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో బన్నీ, శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, బన్నీలు రెండు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులను కలిసేందుకు వెళ్లడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ రెండు ఎపిసోడ్లతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అయోమయానికి గురి చేసినట్లయింది. రవిచంద్ర రెడ్డి భార్య.. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారట. గత ఎన్నికల్లో రవిచంద్ర రెడ్డి కోసం ట్వీట్ చేశానని బన్నీ తాజాగా నంద్యాలలో మీడియాతో తెలిపారు. ఈసారి ట్వీట్ సరిపోదు.. ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని అనిపించింది. ఆయన వద్దు.. మీకు ప్రాబ్లెమ్ అవుతుంది అని చెప్పారు. పర్వాలేదు నేను వస్తాను అని తానే నిర్ణయించుకుని వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు.
పార్టీలతో సంబంధం లేదని అల్లు అర్జున్ తెలిపాడు. తన ఫ్రెండ్స్, మనసుకు నచ్చినవాళ్లు ఏ పార్టీలో ఉన్న సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ తెలిపాడు. శిల్ప రవిచంద్ర ఇంటికి బన్నీ రావడంతో ఆ ప్రాంతం జన సంద్రంలాగా మారింది. వేలాదిమంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే శిల్పా రవిచంద్ర, అల్లు అర్జున్ ఇద్దరికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేసారంటూ కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద బన్నీ, రవిచంద్రపై కేసు నమోదు అయింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.