VC Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ ) కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తెలంగాణ బస్సులలో ప్రతిరోజు వేలాది మంది ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి చేరుతుంటారు. అయితే.. తెలంగాణ సర్కారు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం మనం చూశాం. బస్సులో ఉచిత ప్రయాణాలలో అనుకోనిరీతిలో ఆదరణ లభిస్తుంది. కొన్ని రూట్ లలో బస్సుల కొరత వల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. బస్సులలో కొందరు చిల్లర కోసం, ఆర్టీసీ, డ్రైవర్ లతో గొడవలు పడిన ఘటనలు కడూఆ వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు.
తాజాగా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ పరిధిలో పని చేసే ఇతర సిబ్బంది టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది టీ షర్టులు,జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు వస్తున్నారని, ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఆర్టీసీ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సిబ్బంది, అధికారులు ఎవరైన సరే యూనిఫాం లేదంటే ఫార్మల్ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సజ్జనార్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వాత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇక ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అటు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు ఏపీకి పెద్ద సంఖ్యలో బయలుదేరుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో రాకపోకలు సాగించేందుకు 450 ఆర్టీసీ బస్సులో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సంస్థ 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు తెలియజేశారు.. ఎంజీబీస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 200 ప్రత్యేక బస్సులను నడపనునట్టు అధికారులు తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.