
Amaravati : ఏపీ ప్రజల ఆశలు నెరవేరబోతున్న క్షణం రానేవచ్చింది..!
Amaravati : అమరావతిలో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అమరావతికి వచ్చి 49,040 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా హైకోర్ట్, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అంతేకాక, డీఆర్డీవో, రైల్వే, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి శాఖల ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. నాగాయలంకలో 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
Amaravati : ఏపీ ప్రజల ఆశలు నెరవేరబోతున్న క్షణం రానేవచ్చింది..!
ఈ మహా కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మూడుచోట్ల ప్రజల కోసం సభా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా, ప్రధాన వేదిక మాత్రం ఒక్కటే. ప్రధాని భద్రత కోసం ఎస్పీజీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. హెలిపాడ్ నుంచి కారులోనే వేదిక చేరుకోనున్న మోదీ, అక్కడ అమరావతి రీస్టార్ట్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ పైలాన్ “A” అక్షర ఆకారంలో 21 అడుగుల ఎత్తుతో, పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది.
ప్రజల సందర్శనకు కూడా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటల నుంచి ప్రాంగణానికి ప్రవేశం కల్పించనున్నారు. వర్షం వచ్చినా ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మహిళల హాజరును ప్రోత్సహించేందుకు CRDA బృందాలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానం పలికాయి. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి ఇది ఒక చారిత్రాత్మక దశగా మారనుంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.