Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అరెస్ట్‌కు సంబంధించి విపక్ష నాయకులు, మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అరెస్ట్ పై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కొమ్మినేని అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచినందుకు శిక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కక్షగట్టి అరెస్ట్‌లు చేయడం, అప్రజాస్వామిక ధోరణి అని ఆయన విమర్శించారు.
Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!
రాజకీయ ప్రత్యర్థులను అక్రమ కేసుల్లో ఇరికించడం, మీడియా వేదికలను మూగపరిచే ప్రయత్నాలు, ప్రజాస్వామ్యానికి తలకిందులు చేస్తున్న చర్యలుగా రాంబాబు అభివర్ణించారు. కొమ్మినేని అరెస్ట్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం బెయిల్ రాకుండా చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ నుంచి ఒత్తిడితో తొలగించి, సాక్షిలో చేరిన కొమ్మినేని తన డిబేట్లలో నిక్కచ్చిగా మాట్లాడినందుకే లక్ష్యంగా చేసుకున్నారన్నది ఆరోపణ. కొమ్మినేనిపై పలువురు అనుచితంగా మాట్లాడినా కిరాక్ ఆర్పీ , సీమా రాజాలపై వారిపై చర్యలు లేకపోవడం, మరింత అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
ఇక ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ఈ అరెస్ట్‌లు, మీడియా తణుకు చర్యలు కావచ్చని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు జరిపించడం, టీడీపీ నాయకులు ప్రజల్ని ఎగదట్టి భౌతిక దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. డిబేట్లలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు ఛానల్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం, మీడియా స్వేచ్ఛకు అపాయంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే, విభిన్నమైన గొంతులను అణచివేసే ప్రయత్నాలే కొనసాగుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.