Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడే విధంగా బీపీఎల్ వర్గాల ప్రజలకు నివాస హక్కును కల్పించాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు అదే విధంగా పట్టణాల్లోనూ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ పేదలకు గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!
పట్టణాల్లో స్థలాభావం కారణంగా ప్రభుత్వం జీ+3 నమూనాలో నాలుగు అంతస్థులు కలిగిన అపార్ట్‌మెంట్ గృహాల నిర్మాణాన్ని చేపట్టనుంది. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువమందికి ఇండ్లను అందించడం సాధ్యమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 16 మురికివాడలలో భూములను ఇప్పటికే గుర్తించగా, అందులో కొన్ని ప్రాంతాల్లో భూ వివాదాలు లేకపోవడం వల్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో భూ వివాదాలు, స్థానిక సమస్యలు ఉన్నందున రెవెన్యూ, హౌసింగ్ శాఖలతో కలిసి సమగ్ర సర్వేను చేపట్టి అవసరమైన క్లారిటీ తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 84 వేల ఇండ్లు నిర్మించే ప్రణాళిక ఉంది. ఇదే విధానాన్ని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి జిల్లా కేంద్రాలలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, భద్రత, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలకూ బలమైన బీజం వేస్తుందనే నమ్మకంతో ప్రభుత్వం దీన్ని సమాజ నిర్మాణ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.