Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి కలవనున్న అమిత్‌షా.. ఎన్నికల ముందు బీజేపీ భారీ వ్యూహం

Junior NTR : కేంద్రంలో అధికారంలో బీజేపీ లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది అనడంలో సందేహం లేదు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్న బీజేపీ.. కేవలం వచ్చే సంవత్సరం జరగబోయే లోక్ సభ ఎన్నికల మీదనే దృష్టి పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. మోదీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఇప్పటి నుంచే అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అధిష్ఠానం సన్నిహితంగా మెలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఏదో పేరుకే పార్టీగా ఉంది తప్పితే ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించే సీన్ లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఎంపీ సీటు ముఖ్యమే. బీజేపీ హైకమాండ్ వ్యూహాలే డిఫరెంట్ గా ఉంటున్నాయి. అందులో భాగంగానే గత సంవత్సరం ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా కలిశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా మర్యాద పూర్వకంగా కలిశారు. అది రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారని.. ఏపీలో బీజేపీని పటిష్ఠం చేస్తారంటూ వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. ఇక.. తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారట. మరోసారి త్వరలోనే ఇద్దరూ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. వాళ్ల మీటింగ్ ఎజెండా ఏంటి.. మళ్లీ ఎందుకు కలవబోతున్నారు అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదు.

Junior NTR : జూనియర్ ను మళ్లీ బీజేపీలోకి రావాలని కోరుతారా?

ఏకంగా కేంద్ర హోం మంత్రి దిగి వచ్చి రెండోసారి జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అయితే ఏం లేవు. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం వెనుక ఉద్దేశం ఏంటి. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే సంవత్సరం జరగనున్నాయి. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Recent Posts

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

40 minutes ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

2 hours ago

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…

3 hours ago

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…

4 hours ago

Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…?

Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…

4 hours ago

Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్.. పూన‌కాలు తెప్పిస్తుందిగా..!

Hari Hara Veera Mallu Movie Trailer  : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…

5 hours ago

Ram Charan Fans : రామ్ చ‌ర‌ణ్ చేసిన త‌ప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల‌కి శిరీష్ స‌మాధానం చెబుతారా?

Ram Charan Fans  : 'ఆర్‌.ఆర్‌.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాలు చేయాలని ఆస‌క్తి చూపినా,…

6 hours ago

Buddhas Hand : చేతి వేళలా కనిపించే బుద్ధ హస్త పండుని మీరు చూశారా… ప్రమాదకరమైన వ్యాధులకు చెక్…?

Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…

7 hours ago