Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి కలవనున్న అమిత్‌షా.. ఎన్నికల ముందు బీజేపీ భారీ వ్యూహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి కలవనున్న అమిత్‌షా.. ఎన్నికల ముందు బీజేపీ భారీ వ్యూహం

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి?

  •  జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతున్నారా?

  •  బీజేపీలోకి జూనియర్ ను అమిత్ షా ఆహ్వానించనున్నారా?

Junior NTR : కేంద్రంలో అధికారంలో బీజేపీ లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది అనడంలో సందేహం లేదు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్న బీజేపీ.. కేవలం వచ్చే సంవత్సరం జరగబోయే లోక్ సభ ఎన్నికల మీదనే దృష్టి పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. మోదీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఇప్పటి నుంచే అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అధిష్ఠానం సన్నిహితంగా మెలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఏదో పేరుకే పార్టీగా ఉంది తప్పితే ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించే సీన్ లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఎంపీ సీటు ముఖ్యమే. బీజేపీ హైకమాండ్ వ్యూహాలే డిఫరెంట్ గా ఉంటున్నాయి. అందులో భాగంగానే గత సంవత్సరం ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా కలిశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా మర్యాద పూర్వకంగా కలిశారు. అది రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారని.. ఏపీలో బీజేపీని పటిష్ఠం చేస్తారంటూ వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. ఇక.. తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారట. మరోసారి త్వరలోనే ఇద్దరూ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. వాళ్ల మీటింగ్ ఎజెండా ఏంటి.. మళ్లీ ఎందుకు కలవబోతున్నారు అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదు.

Junior NTR : జూనియర్ ను మళ్లీ బీజేపీలోకి రావాలని కోరుతారా?

ఏకంగా కేంద్ర హోం మంత్రి దిగి వచ్చి రెండోసారి జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అయితే ఏం లేవు. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం వెనుక ఉద్దేశం ఏంటి. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే సంవత్సరం జరగనున్నాయి. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది