Home » Andhra Pradesh » Anchor Shyamala Attack On Pawan Kalyan Punganuru Issue
andhra pradesh

Anchor Shyamala : పవన్ మీద శ్యామల వ్యగ్యాస్త్రాలు.. ఈసారి డైరెక్ట్ ఎటాక్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 7, 2024, 8:00 pm
Advertisement

Anchor Shyamala : సినీ పరిశ్రమలో ఉంటూ రాజకీయాల్లో తమ సపోర్ట్ అందించే వారు కొందరు ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సరే వారి సహకారం అందిస్తుంటారు. ఐతే ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్యామలా వైసీపీకి సపోర్ట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్షంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా పుంగనూరు ఘటన గురించి కూటమి ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు శ్యామల. ఓట్ల కోసం గ్యారంటీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలకి కూడా రక్షణ లేదని అన్నారు. రామ రాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చేశారని మండి పడ్డారు. ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం నోరు మెదపట్లేదని అన్నారు.

Advertisement

Anchor Shyamala పుంగనూరు ఘటన పై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

పుంగనూరు ఘటన పై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్శారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్చగా తిరిగే ఈ దేశంలో ఏపీ మాత్రం ఎటు పోతుందో అని ఆమె అన్నారు. గ్యారంటీల పేరు చెప్పి జనాలను బురిడీ కొట్టించి కూటమి అధికారంలోకి వచ్చింది. సినిమా డైలాగులతో పదవులు దక్కించుకున్న నేతలు అత్యాచారంపై మాట్లాడట్లేదని శ్యామల ఫైర్ అయ్యారు.

Anchor Shyamala : పవన్ మీద శ్యామల వ్యగ్యాస్త్రాలు.. ఈసారి డైరెక్ట్ ఎటాక్..!

Advertisement

సీఎం సొంత జిల్లా చిత్తూరులో జరిగిన ఈ సంఘటనపై శ్యామల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బాబు వస్తే అది వస్తుంది.. ఇది వస్తుంది అన్నారు కానీ ఆయన వచ్చాక ప్రాణాలు పోతున్నాయని ఆమె అన్నారు. శ్యామల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే శ్యామల వ్యాఖ్యలకు కూటమి నేతలు ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి