
AP Bjp : కూటమిలో బీజేపీకి టీడీపీ, జనసేన అంత అన్యాయం చేస్తుందా ?
AP Bjp : ఈ సారి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ, జనసేన, బీజేపీల కలయికతో భారీ విజయం దక్కింది. అయితే కూటమిలో టీడీపీదే మేజర్ రోల్. ఆ తర్వాత జనసేన ఉంటుంది. సినీ గ్లామర్‌తో పాటు సామాజిక నేపథ్యం కలిగిన నేత కాబట్టి పవన్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటన్నది అర్ధం కావడం లేదు. దేశాన్ని ఏలే జాతీయ పార్టీ బీజేపీ. ఏపీలో కూడా ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు. అయిన కూడా బీజేపీకి మంత్రి పదవుల విషయంలోనే అన్యాయం జరిగింది అని మాట వినిపించింది.కనీసం డిప్యూటీ స్పీకర్ అయినా ఇస్తారని బీజేపీ ఆశపడుతోంది.
పొత్తుల కారణంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి గుర్తింపునిస్తూ టీడీపీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అయితే ఇలా త్యాగాలు చేసిన వారు ఒక్క టీడీపీ నేతలే కాదు.. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ.. పోటీ చేయడానికి కూడా అవకాశం రాని వారు ఉన్నారు. వారు నామినేటెడ్ పోస్టుల్లో అయినా కేబినెట్ ర్యాంకు పోస్టులు దక్కాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మొదటి జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొంత మంది నేతలపై టీడీపీ వ్యతిరేకులన్న ముద్ర బలంగా వేశారు కొంత మంది. వారంతా వైసీపీతో సన్నిహితంగా ఉంటారని అంటారు. కానీ వారు దశాబ్దాలగా బీజేపీతో కలిసి పయనిస్తున్న నేతలు.
AP Bjp : కూటమిలో బీజేపీకి టీడీపీ, జనసేన అంత అన్యాయం చేస్తుందా ?
సిద్ధాంత పరంగా పార్టీ విధానాల ప్రకారం.. ఇతర పార్టీల్ని వ్యతిరేకిస్తారు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు అ పార్టీకి పని చేశారు. వైసీపీ ప్రభుత్వంపైనా పోరాడారు . కానీ వైసీపీ ప్రభుత్వంపై వారు చేసిన పోరాటాలకు పెద్దగా ప్రచారం రాలేదు. వారికి ఉన్న ఇమేజ్ మారలేదు. ఇది వారికి ఎక్కువ మైనస్ గా మారుతోంది.టీడీపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. దాంతో బీజేపీ పెద్దలు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. బాబు ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాల్సిందే అని అంటున్నారు. అదే విధంగా కేంద్రంలో అధికారం ముఖ్యం. బాబు లాంటి మిత్రుడు ఇంకా ముఖ్యం. అందువల్ల ఆయనను ఇబ్బంది పెట్టరాదు అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన. దాంతో జనసేన టీడీపీ ఇద్దరూ సర్దుకుని బీజేపీకి ఇవ్వాల్సినవి మాత్రమే ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ గా ఉండాల్సిన ఏపీ బీజేపీ ఇప్పుడు స్తబ్దుగా మారిపోయింది. పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టారు కానీ…ట్రాక్ లోకి తీసుకెళ్లడానికి నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.