Ys Jagan : ఢిల్లీలో సీఎం జగన్ ఎన్నికల స్కెచ్.. అబ్బో అదిరిపోయిందిపో.. ఇది నిఖార్సయిన రాజకీయం అంటే
Ys Jagan : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇక ఎన్నికలకు టైమ్ లేదు. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కదా.. సీఎం జగన్ కూడా ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఒకసారి ఏపీ ప్రజలు జగన్ కు చాన్స్ ఇచ్చారు. కానీ.. కేవలం 5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు. ఇంకా అభివృద్ధి చేయడానికి సమయం కావాలి కదా. అందుకే మాకు మరోసారి చాన్స్ ఇవ్వండి అంటూ వైసీపీ నేతలు ప్రజలను వేడుకుంటున్నారు.
సీఎం జగన్ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చే విధంగా ఎన్నికల్లో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. కానీ.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్న ఏకమై సీఎం జగన్ ను ఓడించే పనిలో పడ్డాయి. అందుకే.. సీఎం జగన్ తన ఆలోచనకు పదును పెట్టి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో వైసీపీ పార్టీ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 175. 2019 ఎన్నికల్లో 150కి పైనే సీట్లు సాధించి భారీ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. 25 ఎంపీలకు 23 ఎంపీలు గెలిచారు. అందుకే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు కేంద్రానికి అవసరం అయినప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు.
Ys Jagan : బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు
తాజాగా ఢిల్లీ బిల్లు విషయంలో వైసీపీ మద్దతుతోనే కేంద్రం బిల్లు నెగ్గించుకుంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఏపీలో జగన్ ను ఎలాగైనా ఓడించాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన.. ఎన్డీఏలో భాగస్వామి. మరోవైపు టీడీపీ, బీజేపీ పొత్తు కలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. ఇంకోవైపు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించాలని టీడీపీ ఆశపడుతోంది. కానీ.. బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు నెరుపుతోంది. ఈనేపథ్యంలో బీజేపీలో చేరితే అది టీడీపీకి నష్టమా.. లాభమా.. ఎందుకు సీఎం జగన్ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారో అసలు విషయం తెలియాలంటే ఎన్నికలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.