YS Jagan : కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలో సరికొత్త ఆశను నెలకొల్పాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిజానికి ఊహించినవే. చాలా రోజుల నుంచి అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటోంది. మెల్లమెల్లగా తాను కోల్పోయిన ఆస్తిత్వాన్ని మళ్లీ నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటక ఫలితాలు తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉందా అనే చర్చ మొదలైంది.
నిజానికి తెలంగాణలో ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఏపీలో ఈసంవత్సరం ఎన్నికలు వచ్చే చాన్సే లేదు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావు.. అంటూ వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయ్యాకే ఏపీలో ఎన్నికలు వస్తాయంటున్నారు వైసీపీ నేతలు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య మీరు గమనించారో లేదో.. చాలా రోజుల నుంచి సీఎం జగన్ ఒక పదాన్న పదే పదే వాడుతున్నారు. అదే క్లాస్ వార్. క్లాస్ వార్ అంటే.. ప్రభుత్వ పథకాలు పొందే వారు, ప్రభుత్వ పథకాలు పొందని వారి మధ్య జరిగే వారు. ప్రభుత్వ పథకాలను పొందే వాళ్లు ఎలాగైనా వైసీపీకి ఓటేస్తారని, ఇక.. ప్రభుత్వ పథకాలు పొందని వారు, వాటి అవసరం లేని వారు.. వైసీపీకి కాకుండా వేరే పార్టీలకు ఓటేస్తారని తెలుస్తోంది. ఈ ఫార్ములాను చూసుకున్నా ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎలాంటి హామీలు ఇచ్చిందో.. ఆ హామీలు అన్నింటినీ నెరవేర్చడమే కాదు.. కొత్త పథకాలను కూడా తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు గతంలో పాలన ఎలా ఉంది. ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అంటూ ప్రతి గడపకు వెళ్లి సర్వే చేసి మరీ.. జగనన్నే మా అండ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ఈ క్లాస్ వార్ ను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేది మళ్లీ వైసీపీనే అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.