Pakistan : అడ్డంగా దివాలా తీసిన పాకిస్తాన్ .. మిస్ అవ్వకూడని న్యూస్ ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: August 31, 2026, 11:59 pm
  •  Pakistan పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ముఖ్యంగా పాక్ ప్రధాన నగరాల్లో ఒకటైన లాహోర్‌లో ధరల మంట సాధారణ

Pakistan : పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ముఖ్యంగా పాక్ ప్రధాన నగరాల్లో ఒకటైన లాహోర్‌లో ధరల మంట సాధారణ ప్రజల నడుము విరుస్తోంది. కూరగాయల నుంచి మొదలుకొని లీటర్ పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్ల వరకు ఏ ఒక్కటీ సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి దాపురించింది. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలు, షాక్ కొడుతున్న కరెంటు బిల్లులు.. మరోవైపు మండిపోతున్న ఆహార పదార్థాల ధరలు.. వెరసి రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, తక్కువ ఆదాయంతో బతికే కుటుంబాలు పూట గడవడమే గగనంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలకు రోజుకు రెండు పూటలా కడుపు నిండా భోజనం చేయడం కూడా ఇప్పుడు కలగా మారిపోయింది.

Pakistan : అడ్డంగా దివాలా తీసిన పాకిస్తాన్ .. మిస్ అవ్వకూడని న్యూస్ ..!

Pakistan : అడ్డంగా దివాలా తీసిన పాకిస్తాన్ .. మిస్ అవ్వకూడని న్యూస్ ..!

Pakistan మండిపోతున్న నిత్యావసరాలు.. మార్కెట్‌కు వెళితే చుక్కలే!

లాహోర్‌ మార్కెట్‌కు వెళ్తే సామాన్యుడికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటా నిత్యం వాడే గోధుమపిండి, వంటనూనె, పప్పు ధాన్యాల ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాయి. కనీసం కూరగాయలు కొనుక్కుని పచ్చడి మెతుకులు తిందామన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. సామాన్యుల కూరగాయలైన బంగాళాదుంపలు, టమాటాల ధరలు ఏకంగా కిలో రూ.150 నుంచి రూ.300 పలుకుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకపక్క ఉద్యోగాలు లేక, ఉన్నా జీతాలు పెరగక జనం అల్లాడుతుంటే.. నిత్యావసరాల ధరలు మాత్రం ప్రతిరోజూ రెక్కలొచ్చినట్లు పైకి ఎగురుతూనే ఉన్నాయి. కేవలం కడుపు నింపుకోవడానికే సంపాదనంతా ఖర్చయిపోతుండటంతో.. ప్రాణాలు నిలిపే మందులు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువులను కూడా పక్కన పెట్టాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వృద్ధులను, పెన్షనర్లను, స్వయం ఉపాధిపై ఆధారపడేవారిని కోలుకోలేని దెబ్బతీసింది. మన్సూర్ అలీ అనే ఒక రిటైర్డ్ టీచర్ తన దీనస్థితిని వివరిస్తూ.. “ప్రభుత్వం ఇచ్చే ఆ కొద్దిపాటి పెన్షన్‌తో నెట్టుకురావడం అసాధ్యంగా మారింది. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాలకు వైద్య ఖర్చులు ఎలా భరించాలో అర్థం కావడం లేదు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉస్మాన్ అలీ అనే ఒక ఆటో డ్రైవర్ తన గుండెకోతను పంచుకున్నాడు. “పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దానికి తోడు నిత్యావసరాల ఖర్చులు. రోజంతా ఎండనక, వాననక కష్టపడి ఆటో నడిపినా.. ఇంటికి వెళ్లేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు” అని కన్నీటి పర్యంతమయ్యాడు.

బ్లాక్ మార్కెట్ దందా.. చేతులెత్తేసిన పాక్ ప్రభుత్వం!

ప్రభుత్వ వైఫల్యం పాక్ ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించే ధరలకు, వాస్తవంగా మార్కెట్‌లో అమ్ముతున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నా.. అడిగే నాథుడే లేకపోయాడు. మార్కెట్లో ధరలను నియంత్రించడంలో పాక్ ప్రభుత్వం అడుగడుగునా ఘోరంగా విఫలమైందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, పెట్రోల్ ధరలు తగ్గాయని పాలకులు గొప్పలు చెబుతున్నా.. ఆ తగ్గుదల ప్రభావం స్థానిక మార్కెట్లో కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలపై ఎందుకు కనిపించడం లేదని సామాన్యులు నిలదీస్తున్నారు. బరితెగించిన వ్యాపారుల దోపిడీని అడ్డుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా అంటూ లాహోర్ వాసులు కదం తొక్కుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp