Romanchakam Movie : బెస్ట్ ఛాన్స్ మరి మిస్ చేస్తారా..?
Romanchakam Movie మరో నాలుగు రోజుల్లో వెండితెరపై 'రోమాంచకం' సందడి మొదలుకానుంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్వయంగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రంపై యూత్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి
Romanchakam Movie : మరో నాలుగు రోజుల్లో వెండితెరపై ‘రోమాంచకం’ సందడి మొదలుకానుంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్వయంగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రంపై యూత్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి. యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎనలేని బజ్‌ను తీసుకొచ్చింది. ఈ వేడుకకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘8 వసంతాలు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు వాసుకి వైభవ్ అందిస్తున్న సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Romanchakam Movie : బెస్ట్ ఛాన్స్ మరి మిస్ చేస్తారా..?
Romanchakam Movie అంచనాలు పెంచేస్తున్న వంగా బ్రదర్స్ ప్రమోషన్స్
సొంత బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కావడంతో వంగా బ్రదర్స్ ‘రోమాంచకం’ ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దర్శకుడు వేణు గోపాల్ రెడ్డికి ఇండస్ట్రీలో ఇంకా బ్రాండ్ ఇమేజ్ లేకపోవడంతో, సందీప్ రెడ్డి వంగ తన సొంత క్రేజ్‌తోనే సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు, అవుట్ డోర్ పబ్లిసిటీని కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. నిన్న అట్టహాసంగా జరిగిన ప్రీ-రిలీజ్ వేడుక కూడా వంగా బ్రదర్స్ ప్రమోషనల్ వ్యూహంలో భాగమే.
బాక్సాఫీస్ వద్ద ‘రోమాంచకం’కు కలిసొచ్చే అంశాలివే!
ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితులను గమనిస్తే ‘రోమాంచకం’ సినిమాకు అద్భుతమైన అవకాశం ఉందనే చెప్పాలి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత మరే ఇతర సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ ఆ సినిమానే ఫస్ట్ ఛాయిస్ అయిపోవడంతో ఏకంగా 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా పరిస్థితి మొదటి రోజే తేలిపోయింది. నెగెటివ్ టాక్ రావడంతో, పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు (హైక్స్) తెచ్చుకున్న నిర్మాతలు.. ఐదు రోజులకే ఆ పెంపును వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెగెటివ్ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉందన్నమాట. ఈ తరుణంలో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘రోమాంచకం’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం.
అయితే, సెప్టెంబర్ మొదటి వారంలో నంబర్ పరంగా పోటీ గట్టిగానే ఉంది. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘రోమాంచకం’ ఈజీగా నిలదొక్కుకుంటుంది. మరోవైపు సెన్సార్ చిక్కుల్లో పడిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా వస్తుందో రాదో నేడు క్లారిటీ రానుంది. అలాగే మలయాళ డబ్బింగ్ మూవీ ‘బెత్లేహమ్ కుటుంబ యూనిట్’ను మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’, అలాగే ‘సహ’ చిత్రాలు కూడా ఈ సెప్టెంబర్ మొదటి వారం రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి ఈ గట్టి పోటీని తట్టుకుని ‘రోమాంచకం’ ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఎలా వాడుకుంటుందో చూడాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే!







