AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..!
AP Volunteers : ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ మీద కొద్దిరోజులుగా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారం చేపట్టాక వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అన్న గందరగోళం ఏర్పడింది. ఐతే కొన్నాళ్లుగా ఇష్యూ పై ఎవరు స్పందించలేదు. ఏపీ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల సాయం లేకుండానే పెన్షన్లు పంపిణి చేయడంతో ఏపీలో ఉన్న వాలంటీర్లు అందరు దాదాపు వారి ఉద్యోగం పోయిందని అనుకున్నారు. వాలంటీర్ల బదులుగా సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేయించారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే ఆలోచన ఏపీ ప్రభుత్వానికి ఉందా లేదా అన్న ఆలోచన వచ్చింది. ఐతే ఏపీ లో జరుగుతున్న అసెంబ్లీలో వాలంటీర్ల వ్యవస్థ మీద క్లారిటీ ఇచ్చారు. ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి డోఆ బాల వీరాంజనేయ స్వామి ఈ విషయాన్ని ప్రస్థావించారు. వాలంటీర్ల వ్యవథ కొనసగుతుందని.. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో వాలంటీర్ల వేతనాలు కూడా పెంచే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందని అన్నారు.
అసలు ఉంటుందో లేదో అన్న ఉద్యోగం అనుకుంటే ఇలా వారికి జీతం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం వాలంటీర్లను సంతోష పెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను తొలగించేది లేదని అన్నారు. ఐతే ఆ తర్వాత పరిణామాలు వాళ్లను తొలగిస్తారేమో అని అన్నారు. వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడంతో వాలంటీర్లంతా సంతొషంగా ఉన్నారు.
AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..!
ఐతే ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి.. కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటారా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద తన స్పందన తెలియచేశారు. వాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. వారిని వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చేలా చూస్తున్నామని అన్నారు. చూస్తుంటే కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.