AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..!

AP Volunteers : ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ మీద కొద్దిరోజులుగా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారం చేపట్టాక వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అన్న గందరగోళం ఏర్పడింది. ఐతే కొన్నాళ్లుగా ఇష్యూ పై ఎవరు స్పందించలేదు. ఏపీ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల సాయం లేకుండానే పెన్షన్లు పంపిణి చేయడంతో ఏపీలో ఉన్న వాలంటీర్లు అందరు దాదాపు వారి ఉద్యోగం పోయిందని అనుకున్నారు. వాలంటీర్ల బదులుగా సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేయించారు. వాలంటీర్ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..!

AP Volunteers : ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ మీద కొద్దిరోజులుగా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారం చేపట్టాక వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అన్న గందరగోళం ఏర్పడింది. ఐతే కొన్నాళ్లుగా ఇష్యూ పై ఎవరు స్పందించలేదు. ఏపీ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల సాయం లేకుండానే పెన్షన్లు పంపిణి చేయడంతో ఏపీలో ఉన్న వాలంటీర్లు అందరు దాదాపు వారి ఉద్యోగం పోయిందని అనుకున్నారు. వాలంటీర్ల బదులుగా సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేయించారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే ఆలోచన ఏపీ ప్రభుత్వానికి ఉందా లేదా అన్న ఆలోచన వచ్చింది. ఐతే ఏపీ లో జరుగుతున్న అసెంబ్లీలో వాలంటీర్ల వ్యవస్థ మీద క్లారిటీ ఇచ్చారు. ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి డోఆ బాల వీరాంజనేయ స్వామి ఈ విషయాన్ని ప్రస్థావించారు. వాలంటీర్ల వ్యవథ కొనసగుతుందని.. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో వాలంటీర్ల వేతనాలు కూడా పెంచే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందని అన్నారు.

AP Volunteers వాలంటీర్లకు పండగ లాంటి వార్త..

అసలు ఉంటుందో లేదో అన్న ఉద్యోగం అనుకుంటే ఇలా వారికి జీతం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం వాలంటీర్లను సంతోష పెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను తొలగించేది లేదని అన్నారు. ఐతే ఆ తర్వాత పరిణామాలు వాళ్లను తొలగిస్తారేమో అని అన్నారు. వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడంతో వాలంటీర్లంతా సంతొషంగా ఉన్నారు.

AP Volunteers వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం వాళ్లకు జీతాలు పెంపు కూడా

AP Volunteers : వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లకు జీతాలు పెంపు కూడా..!

ఐతే ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి.. కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటారా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద తన స్పందన తెలియచేశారు. వాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. వారిని వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చేలా చూస్తున్నామని అన్నారు. చూస్తుంటే కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది