AP Ration Card : ఏపీలో ఉన్న రేషన్ కార్డుదారులకు జగనన్న ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లు చెప్పింది. ఇప్పటికే ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ఈ బియ్యాన్నీ పీడీఎస్ ద్వారా అన్ని జిల్లాల్లో అందిస్తారు.
మామూలు బియ్యం కంటే ఫోర్టిఫైడ్ బియ్యం తింటే అందులో చాలా విటమిన్లు ఉంటాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బీ12 విటమిన్ కూడా ఉంటుంది. ఇవి మనలో రక్తహీనతను తగ్గిస్తాయి. 1 టు 100 నిష్పత్తిలో మిల్ కెర్నెల్ లో ఫోర్టిఫైడ్ రెస్ ను సాధారణ బియ్యంతో కలుపుతారు. అప్పుడే ఆ బియ్యానికి పోషక విలువలు వచ్చి చేరుతాయి. ఈ బియ్యాన్ని గర్భిణీలు, చిన్నారులు, బాలింతలు తీసుకుంటే వాళ్లకు కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి. వాళ్లకు ఫోర్టిఫైడ్ రైస్ పౌష్ఠికాహారం అని చెప్పుకోవాలి.
ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు ఫోర్టిఫై చేసిన గోధుమ పిండిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందు ఫోర్టిఫైడ్ రైస్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత గోధుమ పిండిని అందించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లను పిలిచే అవకాశం ఉంది.
ఫోర్టిఫైడ్ రైస్ ను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నారు. ఏపీలో తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇక.. రాయలసీమలో రేషన్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అవి ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించనున్నట్టు మంత్రి తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.