AP Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి ఆ బియ్యం పంపిణీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి ఆ బియ్యం పంపిణీ

AP Ration Card : ఏపీలో ఉన్న రేషన్ కార్డుదారులకు జగనన్న ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లు చెప్పింది. ఇప్పటికే ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ఈ బియ్యాన్నీ పీడీఎస్ ద్వారా అన్ని జిల్లాల్లో అందిస్తారు. మామూలు బియ్యం కంటే ఫోర్టిఫైడ్ బియ్యం తింటే అందులో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 August 2023,6:30 pm

AP Ration Card : ఏపీలో ఉన్న రేషన్ కార్డుదారులకు జగనన్న ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లు చెప్పింది. ఇప్పటికే ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ఈ బియ్యాన్నీ పీడీఎస్ ద్వారా అన్ని జిల్లాల్లో అందిస్తారు.

మామూలు బియ్యం కంటే ఫోర్టిఫైడ్ బియ్యం తింటే అందులో చాలా విటమిన్లు ఉంటాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బీ12 విటమిన్ కూడా ఉంటుంది. ఇవి మనలో రక్తహీనతను తగ్గిస్తాయి. 1 టు 100 నిష్పత్తిలో మిల్ కెర్నెల్ లో ఫోర్టిఫైడ్ రెస్ ను సాధారణ బియ్యంతో కలుపుతారు. అప్పుడే ఆ బియ్యానికి పోషక విలువలు వచ్చి చేరుతాయి. ఈ బియ్యాన్ని గర్భిణీలు, చిన్నారులు, బాలింతలు తీసుకుంటే వాళ్లకు కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి. వాళ్లకు ఫోర్టిఫైడ్ రైస్ పౌష్ఠికాహారం అని చెప్పుకోవాలి.

AP Ration Card : ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు గోధుమ పిండి కూడా అందించనున్న ప్రభుత్వం

ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు ఫోర్టిఫై చేసిన గోధుమ పిండిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందు ఫోర్టిఫైడ్ రైస్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత గోధుమ పిండిని అందించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లను పిలిచే అవకాశం ఉంది.

ఫోర్టిఫైడ్ రైస్ ను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తయారు చేస్తున్నారు. ఏపీలో తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇక.. రాయలసీమలో రేషన్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అవి ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించనున్నట్టు మంత్రి తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది