Ap : ఏపీ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టు.. పూర్తయితే జగన్ కు తిరుగుండదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ap : ఏపీ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టు.. పూర్తయితే జగన్ కు తిరుగుండదా..?

Ap : ఏపీలో ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో నిర్వహిస్తున్నారు సీఎం జగన్. మరీ ముఖ్యంగా ఒక్క చోటనే అభివృద్ధిని కేంద్రీకరించకుండా.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కడపలో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం వైఎస్సార్‌ ఈఎంసీ(ఎలాక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌). ఈ ప్రాజెక్ట్‌ను కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. దీన్ని 2020లో శంఖుస్థాపనలు చేసి ప్రారంభించారు సీఎం జగన్. ఏపీలో ఉన్న […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ap : ఏపీ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టు.. పూర్తయితే జగన్ కు తిరుగుండదా..?

Ap : ఏపీలో ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో నిర్వహిస్తున్నారు సీఎం జగన్. మరీ ముఖ్యంగా ఒక్క చోటనే అభివృద్ధిని కేంద్రీకరించకుండా.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కడపలో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం వైఎస్సార్‌ ఈఎంసీ(ఎలాక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌). ఈ ప్రాజెక్ట్‌ను కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. దీన్ని 2020లో శంఖుస్థాపనలు చేసి ప్రారంభించారు సీఎం జగన్.

ఏపీలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు వారిని ఆర్థికంగా బలపర్చే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదకన పనులు చేయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలకు స్థలాలు కేటాయించారు. అయితే ఇది ఇప్పటిది కాదండోయ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే కడపలో ఓ పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలని భావించారు. దాన్ని ఇప్పుడు జగన్ పూర్తి చేస్తున్నారు. దీన్ని మొదట్లో 540 ఎకారాల్లో స్టార్ట్ చేసి.. ఆ తర్వాత 801 ఎకరాలకు విస్తరిస్తున్నారు. కంపెనీలకు ప్రధానంగా నీరు, కరెంట్, స్థలాలు కేటాయిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతాయి.

ఈ విషయాన్ని జగన్ కూడా పసిగట్టారు. అందుకే ఇప్పుడు ఇలాంటికంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నేషనల్‌ హైవే 67 కేవలం 5.7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే.. కృష్ణాపురం రైల్వేస్టేషన్ 4.9 కి.మీ, కడప రైల్వే స్టేషన్-10.8 కి.మీల దూరంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ భాగాలు, మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ.. వాటితో పాటు కెమెరాలు, బ్యాటరీలు, ఛార్జర్ లు తయారు చేస్తున్నారు. వాటితో పాటు మెడికల్, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేయబోతున్నారు. ఇందులో మొత్తం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గనక మొత్తం పూర్తి అయితే దాదాపు ఏపీలోని 30 వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ హబ్ గా తయారవుతుంది. ఒక రకంగా ఇది రాయలసీమకే ప్రసిద్ధి గాంచిన కంపెనీగా మారుతుంది. దాని వల్ల మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది