Home » Andhra Pradesh » Ap Municipal Elections 2026
andhra pradesh

AP Municipal eElections 2026 : బిగ్ బ్రేకింగ్ : ఏపీ లో మళ్ళీ ఎన్నికలు..!

AP Municipal elections 2026 ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 20, 2026 11:16 am
Advertisement

AP Municipal elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే వివిధ కోర్టు కేసుల కారణంగా 23 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రస్తుతం వాయిదా పడిన నేపథ్యంలో.. మిగిలిన 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు దృష్టి సారించారు.ఇప్పటికే రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. మరో 13 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు నవంబర్‌లో ముగియనుంది.

Advertisement

AP Municipal eElections 2026 : బిగ్ బ్రేకింగ్ : ఏపీ లో మళ్ళీ ఎన్నికలు..!

దీంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అమలు చేస్తున్న 33.33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది.

Advertisement

AP Municipal elections 2026 కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కో ప్రక్రియను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ క్రమంగా వేగం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులోనూ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వెల్లడించారు. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు సమర్పించేందుకు తమకు తగిన సమయం అవసరమని ప్రభుత్వం కోర్టును కోరింది.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మొత్తంగా చూస్తే.. 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించడం, బీసీ రిజర్వేషన్లను 33.33 శాతంగా కొనసాగించాలని నిర్ణయించడం, అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి