Irumudi Vs Viswanath And Sons : సూర్య సినిమా ని దెబ్బ కొట్టబోతున్న ఇరుముడి ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 20 August 2026, 12:30 pm
  •  Irumudi Vs Viswanath And Sons : తెలుగు మార్కెట్‌లో తమిళం కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు రెండో వారం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఆగస్టు 26న ‘టాక్సిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో

Irumudi Vs Viswanath And Sons : తెలుగు మార్కెట్‌లో తమిళం కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు రెండో వారం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఆగస్టు 26న ‘టాక్సిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, అప్పటిలోగా సాధ్యమైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే వీకెండ్ సినిమాకు అత్యంత కీలకంగా మారనుంది. అయితే వీకెండ్ కంటే ముందే ‘ఇరుముడి’ రూపంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఇరుముడి’కి ఇప్పటికే కనిపిస్తున్న ప్రీ-రిలీజ్ పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అందుకే ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Irumudi Vs Viswanath And Sons : సూర్య సినిమా ని దెబ్బ కొట్టబోతున్న ఇరుముడి ?

Irumudi Vs Viswanath And Sons : సూర్య సినిమా ని దెబ్బ కొట్టబోతున్న ఇరుముడి ?

Irumudi Vs Viswanath And Sons రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలేనా?

‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వస్తే రవితేజ బాక్సాఫీస్‌ను గట్టిగా ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. గతంలో సంక్రాంతి సమయంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ట్రాక్ రికార్డును అభిమానులు గుర్తు చేస్తున్నారు. అలాగే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు పండగ సీజన్‌లో ఉన్న పోటీ కారణంగా వసూళ్లపై ప్రభావం పడిందనే అభిప్రాయం ఇప్పటికీ కొంతమంది అభిమానుల్లో ఉంది. అయితే ‘ఇరుముడి’ విషయంలో అలాంటి సమస్య లేదని చెప్పొచ్చు. ఈ సినిమా సోలోగా బరిలోకి దిగుతోంది. పైగా ప్రమోషన్లను కూడా బాగానే నిర్వహించడంతో సినిమా గురించి ప్రేక్షకులకు ఇప్పటికే మంచి స్థాయిలో రీచ్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్‌పై కూడా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గ అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండటం సినిమాకు అదనపు బలంగా మారొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Irumudi Vs Viswanath And Sons ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ.150 కోట్లు దాటిందా? ఇండస్ట్రీలో చర్చ

ఇక ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయానికి వస్తే.. నిర్మాణ సంస్థ ప్రకటించిన కలెక్షన్ల ప్రకారం సినిమా ఇప్పటికే రూ.150 కోట్ల మార్క్‌ను దాటిందా లేదా అనే అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిర్మాత నాగవంశీ గతంలో కలెక్షన్లలో ఎంతో కొంత కలుపుకోవడం అందరూ చేసే విషయమేనని చెప్పిన సందర్భాన్ని కొందరు ఇప్పుడు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తదుపరి టార్గెట్‌గా రూ.200 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మార్క్‌ను అందుకోవాలంటే ఏపీ, తెలంగాణ మార్కెట్ల నుంచి వచ్చే వసూళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా రెండో వారంలో కలెక్షన్లను నిలబెట్టుకోవడం, ఆగస్టు 26న ‘టాక్సిక్’ విడుదలకు ముందు వీలైనంత ఎక్కువ వసూళ్లు సాధించడం సినిమాకు చాలా అవసరం.మరోవైపు ‘ఇరుముడి’కి ఉన్న ప్రధాన బలం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలే. సినిమాలో అయ్యప్పస్వామి మాల నేపథ్యంలో రెండు పాటలు ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా డివోషనల్ సినిమా కాదని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రివెంజ్ డ్రామాతో పాటు క్రైమ్ యాంగిల్‌ను కూడా కథలో మేళవించారు.

అన్నింటికంటే ముఖ్యంగా కూతురు సెంటిమెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అయ్యప్ప మాల ధరించి హుందాగా కనిపించే రవితేజను ఒకవైపు చూడొచ్చు. మరోవైపు మాస్ రాజా మార్క్‌లో మందు తాగి బండి నడిపే మాస్ క్యారెక్టర్‌ను కూడా చూడొచ్చనే అంశం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ‘ఇరుముడి’కి ఎలాంటి టాక్ వస్తుంది? ఆ టాక్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రెండో వారం కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపుతుంది? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. రవితేజ సినిమాకు బలమైన పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp