Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

Asaduddin Owaisis : సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని ఓవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం పగ్గాల్ని మరోవైపు మోస్తున్న నారా చంద్రబాబు నాయుడిపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచన చేశారు. ముఖ్యంగా పార్టీ పగ్గాల విషయంలో లోకేష్ కు మద్దతుగా ఓవైసీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Asaduddin Owaisis లోకేష్ నీ భవిష్య‌త్చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

Asaduddin Owaisis : లోకేష్‌పై కామెంట్స్..

చంద్రబాబు తన కంటే, తన పార్టీ కంటే లోకేష్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎలాగో తన తర్వాత కుమారుడు లోకేషే పార్టీ పగ్గాలు తీసుకుంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పదవికి పోటీ రాడు కదా అని ఓవైసీ వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ నుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తుండగా.. ఆయన అంత పాపులరా అని ఓవైసీ వారిని ప్రశ్నించారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అని, గతంలో సీఎంగా తొమ్మిదేళ్లు, విపక్ష నేతగా పదేళ్లు పనిచేశారని గుర్తుచేశారు.

అటువంటి వ్యక్తి లోకేష్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ సూచించారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్న లోకేష్ కు చంద్రబాబుకు ఆటోమేటిక్ వారసుడిగా ఇప్పటికే పేరు వచ్చేసింది. అదే సమయంలో ఆయన కాబోయే సీఎం అనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన సూచన చంద్ర‌బాబు ప‌ట్టించుకుంటాడా అనేది చూడాలి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది