
bandi sanjay to be appointed as ap bjp incharge
Bandi Sanjay : బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉండి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఒకప్పుడు బీజేపీ అంటేనే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఎప్పుడైతే బండి సంజయ్ ఎంపీ అయ్యారో.. తెలంగాణ బీజేపీకి చీఫ్ అయ్యారో అప్పటి నుంచి బీజేపీ బలం పెరిగింది. దీంతో కేంద్రం కూడా బండి సంజయ్ కి కొన్ని పవర్స్ ఇచ్చేసింది. దాని వల్ల తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కొన్ని మార్పులు చేసింది బీజేపీ.
తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ని ఇటీవల మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డిని బీజేపీ చీఫ్ గా చేసిన తర్వాత బండి సంజయ్ ఏ పదవి లేకుండా ఉన్నారు. కానీ.. ఇటీవల ఆయన్ను బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా హైకమాండ్ నియమించింది. అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమితులయ్యారు.ఆ పదవితో పాటు మరో పదవి కూడా బండి సంజయ్ కి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ గా బండి సంజయ్ ని నియమించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందట.
bandi sanjay to be appointed as ap bjp incharge
దానికి కారణం.. తెలంగాణ ఉన్నంత బలంగా బీజేపీ ఏపీలో లేదు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి కారణం బండి సంజయ్. అందుకే.. ఏపీలో బండి సంజయ్ కి కీలక పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో బీజేపీ బలపడాలంటే బండి సంజయ్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ గా సునీల్ దేవ్ ధర్ ఉన్నారు. ఆయన స్థానంలోనే బండి సంజయ్ ని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.