Barrelakka Sirisha : వైసీపీలోకి వెళ్లనున్న బర్రెలక్క.. ఆ నియోజకవర్గం కన్ఫామ్ చేసిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి..!!
ప్రధానాంశాలు:
Barrelakka Sirisha : వైసీపీలోకి వెళ్లనున్న బర్రెలక్క.. ఆ నియోజకవర్గం కన్ఫామ్ చేసిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి..!!
Barrelakka Sirisha : రాజకీయ ప్రత్యర్థులను ఆంధ్రప్రదేశ్ టార్గెట్ చేయడం కోసం తెలంగాణ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా తెలంగాణ ఎలక్షన్స్ లో వినపడ్డ పేరు బర్రెలక్క. ఆమెకు దాదాపుగా 5 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.కానీ ఆమె చివరి రౌండ్ కి వచ్చే వరకు ఓడిపోయారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఆమె ప్రజల నోట్లో బాగా నానారు. ఆమె గెలవక పోయినప్పటికీ ఆమె వైరల్ అయిన అంశాన్ని ఫేమస్ అయినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి వైసీపీ తెలివిగా వాడుకుంటుంది. ప్రజలతో మమైకం అవుతున్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేస్తూ దత్త పుత్రుడికి కనీసం బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పొలిటికల్ గా ఎవరిని టార్గెట్ చేయాలో మొదటినుంచి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి తెలుసు. చాలా తెలివిగా ఇక్కడ బర్రెలక్క తో పవన్ కళ్యాణ్ ఇరికించి జనసేన ఏమి మాట్లాడకుండా చేశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు బర్రెల అక్క పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తేనో, సెటైర్లు విసిరితేనో, జనసేన దానికి రెస్పాండ్ అయితే బర్రెలక్కను హైలెట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి జనసేన ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తే డిపాజిట్లు కూడా సంపాదించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. రూపాయి ఖర్చు లేకుండా బర్రెలక్క పార్టీ ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క పొజిషన్ మంచిగా ఉంది.
ఏపీలో కూడా ఆయన పరిస్థితి అలానే ఉంటుందని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బర్రెలక్క తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది గమనించిన వైసీపీ ఆమె ఆర్థిక పరిస్థితిని కాస్త మెరుగుపరిచి ఏపీకి తీసుకువచ్చి తమ పార్టీలో జాయిన్ చేసుకొని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో పోటీ చేయించగలిగితే కచ్చితంగా సక్సెస్ అవుతామని, ఆమె గెలవకపోయినా కానీ పవన్ కళ్యాణ్ స్థాయిని కిందికి దించినట్లు అవుతుంది అని వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారని, ఈ ఐడియాను వర్క్ అవుట్ చేసేందుకు వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులతో మాట్లాడారని టాక్.